విజయవాడ:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కృష్ణా జిల్లా నగర తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు వల్లభనేని వంశీ మోహన్ కలవడం
జూనియర్ ఎన్టీఆర్కు ఇక్కట్లు తెచ్చిపెట్టిందని
అంటున్నారు. మూడు రోజుల క్రితం
వల్లభనేని వంశీ యువనేత జగన్ను కలిసిన విషయం
తెలిసిందే. ఇది రాజకీయావర్గాల్లో తీవ్రమైన
చర్చకు దారి తీసింది. వల్లభనేని
వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని ప్రచారం జరిగింది.
అంతేకాదు
వంశీ సినీ హీరో జూనియర్
ఎన్టీఆర్కు మంచి స్నేహితుడు.
దీంతో వారి కలయిక వెనుక
జూనియర్ ఉండి ఉండవచ్చుననే ప్రచారం
కూడా జరిగింది. జూనియర్ సూచనల మేరకే వంశీ
అతనిని కలిసి ఉంటాడనే అనుమానాలు
పలువురు వ్యక్తం చేశారు. జగన్, వంశీల వెనుక
జూనియర్ ఉన్నాడా లేడా అనే విషయం
పక్కన పెడితే, నందమూరి, తెలుగుదేశం పార్టీ అభిమానుల నుండి ఎదురుదెబ్బ తగులుతోందని
అంటున్నారు.
కృష్ణా
జిల్లాలో అభిమానులతో పాటు పలువురికి జూనియర్
ఎన్టీఆర్ నందమూరి హీరో కాదని, ఇటీవల
విడుదలైన ఆయన దమ్ము చిత్రం
చూడవద్దంటూ భారీగా మెసేజ్లు వెళుతున్నాయట. సింహా
బాలకృష్ణ ఒక్కరే నందమూరి హీరో అంటూ అందులో
ఉన్నాయట. దీంతో బాలయ్య అభిమానులు,
టిడిపి నేతలు ఈ మెసేజ్లు పంపించి ఉంటారని
భావిస్తున్నారు.
అంతేకాదు
త్వరలో బాలకృష్ణ అధినాయకుడుగా వస్తున్న పబ్లిసిటీ పోస్టర్లో జూనియర్ ఎన్టీఆర్
లేరట. ఆ పోస్టర్లో
నందమూరి కుటుంబ హీరోలందరి ఫోటోలు ఉన్నాయి. అంతేగాక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, బాణం, సోలో చిత్రాలతో
సొంత ఇమేజ్ సంపాదించుకున్న నారా
రోహిత్‌ల ఫోటోలు అందులో
ఉన్నాయట. కానీ జూనియర్ ఎన్టీఆర్
పేరు మాత్రం లిస్టులే లేదట. ఇది నందమూరి
అబిమానుల మధ్య చర్చనీయాంశమైంది.
0 comments:
Post a Comment