హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సమావేశంలో
తనపై వచ్చిన విమర్శలపై తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి
చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం స్పందించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో తెరాసకు
తాను, జెఏసి సహకరించలేదన్నది ఆ
పార్టీ అంతర్గత విషయమని ఆయన చెప్పారు. అంతిమంగా
సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఏం నిర్ణయం తీసుకుంటారన్నదే
తమకు ప్రధానమని ఆయన చెప్పారు.
పార్టీ
నిర్ణయం అధికారికంగా ప్రకటించిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు.
ఉద్యమంలో కొన్ని అభిప్రాయబేధాలు సహజమేనని ఆయన కొట్టిపారేశారు. అయినా
పరకాల నియోజకవర్గంలో గెలుపు కోసం తెలంగాణవాదులు అంతా
ఏకత్రాటి పైకి రావాలని ఆయన
సూచించారు. ఉద్యమ ప్రయోజనాల కోసం
అందరం కలిసి పని చేయాల్సి
ఉందని చెప్పారు. పరకాలలో తెలంగాణవాదుల మధ్య ఐక్యత రావాలని
ఆయన అభిప్రాయపడ్డారు. భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ కలిసి పని చేస్తామని
చెప్పారు.
కాగా
ఇటీవల ఉప ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో పార్టీ
అభ్యర్థి ఓటమికి తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ను బాధ్యుడ్ని చేసేందుకు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు సిద్దపడ్డారన్న విషయం తెలిసిందే. మహబూబ్నగర్లో ఓటమిపై
సోమవారం తెరాస పోలిట్బ్యూరో
సమావేశంలో వేడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మహబూబ్నగర్లో తెలంగాణ
జెఎసి సహకరించలేదని, కోదండరామ్ స్తబ్దుగా వ్యవహరించారని తెరాస నాయకులు సమావేశంలో
విమర్శించారు.
బిజెపి
కూడా పోటీలో ఉండడంతో తెలంగాణ జెఎసి తెరాసకు స్పష్టంగా
మద్దతు ప్రకటించలేకపోయింది. బిజెపి కూడా జెఎసిలో ఉండడం,
తెలంగాణ అనుకూలంగా స్పష్టమైన వైఖరి తీసుకోవడం తెలంగాణ
జెఎసిని ఇరకాటంలో పెట్టింది. దాంతో జెఎసి ఏ
పార్టీకి కూడా మద్దతు ప్రకటించలేదు.
జిల్లా జెఎసి మాత్రం బిజెపి
అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డికి సహకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్లనే బిజెపి అభ్యర్థి విజయం సాధించినట్లు భావిస్తున్నారు.
తెరాస అభ్యర్థి మైనారిటీ కావడంతో కెసిఆర్పై తీవ్రమైన విమర్శలు
వచ్చాయి.
0 comments:
Post a Comment