నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. కానీ తెలుగులో నిలదొక్కుకోలేకపోయాను. తెలుగులో కంటే తమిళంలోనే కాస్త మంచి సినిమాలు చేశాను. దానికి కారణాలు వెతుక్కోవడం నాకు ఇష్టం ఉండదు అంటోంది మధు శాలిని. ఆమె తన తాజా బాలీవుడ్ చిత్రం ‘డిపార్ట్మెంట్’త్వరలో విడుదల కానున్న సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఆమె తెలుగు అమ్మాయి కావటం వల్లనే ఇక్కడ నిలదొక్కుకోలేకపోయానా అనే సందేహం వెల్లబుచ్చుతోంది. ‘డిపార్ట్మెంట్’లో ఆమె లేడీ గ్యాంగస్టర్ గా చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తనకు బాలీవుడ్ లో బ్రేక్ ఇస్తుందని భావిస్తోంది.
ఆ విషయం ప్రస్దావిస్తూ..‘డిపార్ట్మెంట్’ మాత్రం నా జీవితాన్ని మార్చే సినిమా. నా ఫేవరెట్ డెరైక్టర్ రామ్గోపాల్వర్మ. ఆయన దర్శకత్వంలో నటిస్తానని అస్సలు ఊహించలేదు. ఆయన దృష్టిలో పడటమే ఓ అద్భుతంగా నేను భావిస్తుంటే... ఏకంగా బిగ్ బీతో నటించే ఛాన్స్ ఇచ్చేశారు వర్మ. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్న విషయం ఇది. చాలా సన్నివేశాల్లో ఆయన అభినందనలు నాకు దక్కాయి. ఆ క్షణాల్లో ప్రపంచాన్నే జయించినంత ఆనందం కలిగింది. మే 18న ‘డిపార్ట్మెంట్’ విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్లో నా పేరు మారుమోగిపోవడం ఖాయం అంది మధుశాలిని.
ఇక మధుశాలిని గత ఏడాది తమిళంలో బాల దర్శకత్వంలో ఈ ముద్దుగుమ్మ నటించిన ‘అవన్ ఇవన్’ చిత్రం ‘వాడు వీడు’గా తెలుగులో విడుదలైంది. ఈ సినిమాతోనే ఆమె రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డారు. అందులో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇక తెలుగులో చాలా సినిమాల్లో చేసినా రాని పేరు ఆమెకు ఈ ఒక్క సినిమాతో రావటం ఆమెకు ఆనందాన్ని ఇస్తోంది. డిపార్టమెంట్ లో చేసిన తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడామె ఆచి తూచి అడుగులు వేయాలనే నిర్ణయంలో ఉంది. బాలీవుడ్ లో ఈ సినిమా రిలీజయ్యి వచ్చే రిజల్టుని బట్టి తన భవిష్యత్ ప్రణాళికను రచించాలనుకుంటోంది.
ఇక ‘డిపార్ట్మెంట్’ విషయానికి వస్తే.. రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో అమితాబ్బచ్చన్ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్లో రూపొందుతోన్న చిత్రమిది. నిర్మాణం కూడా పూర్తి కావచ్చిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్తో కలిసి నటిస్తున్నారు మధుశాలిని. తెలుగు నుంచి రానా,మంచు లక్ష్మి ప్రసన్న కూడా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సంజయ్ దత్,అమితాబ్ వంటి హేమా హేమీలు నటించటంతో ఈ ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చింది. బ్రెజిల్ మోడల్ నధాలియా చేసిన ఐటం సాంగ్ కూడా ఈ సినిమా ప్రోమో ల ద్వారా మారు మ్రోగుతోంది.
0 comments:
Post a Comment