ఒక వ్యక్తిని రాజకీయంగా రూపుమాపటం కోసం రాష్ట్రంలో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం, వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిన దర్యాఫ్తు సంస్థలు, ఎల్లో మీడియా అంతా దుష్టచతుష్టయంగా చేతులు కలిపి మూకుమ్మడిగా ఒక్కడిపై చేస్తున్న దాడి రోజురోజుకూ తీవ్రమవుతోందని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక కథనం ప్రచురించింది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక విష ప్రచారం మరింత పదునెక్కిందని రాసింది. పథకాలు అమలవుతున్నాయని కాంగ్రెసు చెబుతోందని, ప్రజల్లోకి వెళ్లి అడుగుదామా అని ప్రశ్నించింది.
నిజానిజాలు మరిచి, ఉచితానుచితాలు విచక్షణ లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలపై పదే పదే వివరణలు ఇచ్చినా, నిరూపణలు చేసినా తీరు మారటం లేదని పేర్కొంది. నిరాధారమని తేలినప్పటికీ తప్పుడు ఆరోపణలనే మళ్లీ మళ్లీ చంద్రబాబు చేస్తున్నారని, ఆరోపణలకు చిలువలు వలువలు కలిపి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోందని, బాబు లెక్క ప్రకారం ఆయనకూ ఎన్నో నేరాల్లో పాత్ర ఉన్నట్టే కదా అని ప్రశ్నించింది.
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బ్లాక్ మెయిలింగ్ ద్వారానే పదవులు పొందడం అందరికీ తెలుసని పేర్కొంది. పథకాలు కాంగ్రెసువే అయితే మిగతా రాష్ట్రాలలో ఎందుకు లేవో చెప్పగలరా అని ప్రశ్నించింది. జగన్, ఆయన పార్టీపై దాడికి ఢిల్లీ స్థాయిలోనే వ్యూహరచన సాగుతోందని ఆరోపించింది. మహాభారతంలో అభిమన్యుడిని మట్టుపెట్టడం కోసం దుష్టచతుష్టయమై దుర్యోదన, దుశ్యాసన, కర్ణ, శకునులు యుద్ధ నియమానలన్నింటినీ తుంగలో తొక్కారని, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదదే అని తెలిపింది.
సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాననే విశ్వాసం ప్రజలకు కలిగించడం లేదని, సిబిఐ తీరు ఒక్కో కేసులో ఒక్కో విధంగా ఉందని అనుమానాన్ని వ్యక్తం చేసింది. జగన్కు చెందిన కంపెనీలన్న సాగుతో సాక్షి దినపత్రిస, సాక్షి టివి ఛానళ్ల పైనా వేధింపులు తప్పటం లేదని తెలిపింది. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు రావణాసురుడు ఎవరో తెలుసని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొంది. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన బాబు నిస్పృహలో మాట్లాడుతున్నారని రాసింది. అప్పుడు వైయస్ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే చంద్రబాబు ఎందుకు తగ్గారో చెప్పాలని ప్రశ్నించింది.
మంగళి కృష్ణ, భాను కిరణ్, మద్దెలచెర్వు సూరిల విషయంలోనూ బాబు జగన్కు సంబంధం ఉందని అర్థం వచ్చేలా ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదని తెలిపింది. జగన్తో పరిచయం ఉన్న వాళ్ల వ్యవహారంలో జగన్కు భాగస్వామ్యం ఉందని చంద్రబాబు అంటే, ఆయనతో పరిచయం ఉన్న వారు చేసిన వారికి కూడా బాబుదే బాధ్యతా ఉండాలి కదా అని పేర్కొంది. తాజాగా మరో పాత్ర చెలరేగి జగన్ను విమర్శించడం ప్రారంభించిందని చిరంజీవిని పేర్కొంది. సోనియాతో భేటీ తర్వాత ఆయన, ఆమె ఉపదేశాలు స్వీకరించి వచ్చి ఆరోపణలు ప్రారంభించారని రాసింది.
జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తన తండ్రి భౌతికకాయం ఇంటికి రాకముందే ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ జరిపారని, తన మద్దతు కూడా అడిగారని, వైయస్ అమలు చేసిన పథకాలు కాంగ్రెసువే అని, ఆ పథకాలు అమలు కావడం లేదని జగన్ ఆరోపిస్తున్నారని చిరు అంటున్నారని రాసింది. అయితే చిరంజీవి తన వర్గానికి, తనకు పదవులు, పనులు సమకూర్చుకున్నది బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనేనని పేర్కొంది.
టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చిరు చివరి నిమిషం వరకు విప్ జారీ చేయకుండా బ్లాక్ మెయిల్ చేసి బేరం కుదుర్చుకున్నారన్న విషయం బహిరంగ రహస్యమని తెలిపింది. ఎన్నికలలో టిక్కెట్లును చిరంజీవి అమ్ముకున్నట్లు పుంఖానుపుంఖలుగా వార్తలు వచ్చాయని తెలిపింది. ఒక వ్యక్తి కోసం ఉప ఎన్నిక అయితే తిరుపతి ఉప ఎన్నికలు ఎవరికోసమో చెప్పాలని ప్రశ్నించింది. ప్రజారాజ్యంను హోల్ సేల్గా అమ్మేసి జగన్ను విమర్శిస్తారా అని ప్రశ్నించింది.
0 comments:
Post a Comment