బాలీవుడ్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎఫెక్టు రాజ్యసభలో పడనుంది. రేఖ రాజ్యసభకు ఎంపిక కావడంతో అమితాబ్ బచ్చన్, రేఖ, జయా బచ్చన్ సిల్సిలా చర్చనీయాంశంగా మారింది. జయా బచ్చన్, రేఖ రాజ్యసభలో ఎదురు పడితే వ్యవహరిస్తారనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, రేఖ రాజ్యసభకు ఎంపికైన ప్రభావం వెంటనే కనిపించింది. రాజ్యసభ సభ్యురాలైన జయా బచ్చన్ తన సీటును మార్చాలని చైర్మన్ హమీద్ అన్సారీని కోరారు.
రాజ్యసభకు నామినేట్ అయిన 12 మంది సభ్యుల వరుస జయా బచ్చన్ కూర్చునే సీటు వెనకే ఉంటుంది. దాంతో రేఖ జయాబచ్చన్ వెనక వరుసలోకి వస్తారు. రేఖ తన వెనక కూర్చోవడం, ఆమెకు సన్నిహితంగా తాను కూర్చోవాల్సి రావడం ఇష్టం లేని జయా బచ్చన్ సీటు మార్పును కోరినట్లు తెలుస్తోంది. జయా బచ్చన్ సమాజ్వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.
మామూలుగా అయితే, రాజకీయ కారణాల వల్ల సభ్యులు సీటు మార్పు కోరుతుంటారు. అంటే, తనను రాజ్యసభకు ఎన్నిక చేసిన పార్టీతో విభేదాలుంటే అలాంటి మార్పును కోరుతారు. అయితే, జయా బచ్చన్కు అటువంటి సమస్యేమీ లేదు. సమాజ్వాదీ పార్టీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా సీటు మార్పు కోరుతున్నారంటే, అది రేఖ మహిమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
జయా బచ్చన్కు ప్రతిగా రేఖను రాజ్యసభకు నామినేట్ చేయాలని మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన సలహా ఇచ్చినట్లు, ఆ సలహా మేరకు రేఖను రాజ్యసభకు నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రకంగా రేఖ రాజ్యసభకు నామినేట్ కావడంతో జయాబచ్చన్ ఇబ్బంది పడినట్లు తాజా పరిణామాన్ని బట్టి అర్థమవుతోంది. జయా బచ్చన్ సీటు మార్పు విజ్ఞప్తిని అన్సారీ మన్నిస్తారో, తిరస్కరించాలో వేచి చూడాల్సిందే.
0 comments:
Post a Comment