కడప:
జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత మైసూరా రెడ్డి
త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మైసూరా రెడ్డి సొంత పార్టీపై తీవ్ర
అసంతృప్తితో ఉన్నారు. తనకు మరో దఫా
రాజ్యసభ అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన బాబుపై గుర్రుగా
ఉన్నారు. దీంతో ఆయన జగన్
వైపు వెళతారా అనే ప్రచారం జిల్లాలో
జరుగుతోంది. గత మూడు రోజులుగా
చంద్రబాబు కడప జిల్లా ఉప
ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో పర్యటించారు.
ఆ జిల్లాకే చెందిన నేత అయినప్పటికీ మైసూరా
ప్రచారంలో ఎక్కడా పాల్గొనలేదు. ఆయన మేనత్త మరణించారని,
అందుకే ఆయన పాల్గొనలేదని కొందరు
చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో
మైసూరా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఓ మండలస్థాయి నేత
ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారని,
కానీ చంద్రబాబును మాత్రం కలవలేదని అంటున్నారు.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆయన టిడిపిని వీడి
వైయస్సార్ కాంగ్రెసులో చేరతారా అన్న ప్రశ్న పలువురిలో
తలెత్తుతోంది. ఇటీవల మైసూరా తనకు
మద్దతుగా ఉన్న మండల, గ్రామస్థాయి
నేతలను ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్నారట. కడప ఉప ఎన్నికలలో
తనను పోటీలోకి దించి.. రాజ్యసభ స్థానం మరోసారి ఇస్తానని బాబు అన్నారని, కానీ
ఆ తర్వాత తనకు అవకాశం ఇవ్వకుండా
అన్యాయం చేశారని మైసూరా వాపోతున్నారట.
తనకు
ఇవ్వకపోవడమే కాకుండా సొంత జిల్లాకు చెందిన
సిఎం రమేష్కు ఇవ్వడం
ఆయనకు మరింత అసంతృప్తిని కలిగించిందని
అంటున్నారు. రాజ్యసభ ఎన్నికలు ముగిశాక చంద్రబాబు కడప జిల్లా రాయచోటి
నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా మైసూరా డుమ్మా
కొట్టారు. దీంతో మైసూరా యువనేత
వైపు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు.
కాగా
రెండోసారి చంద్రబాబు తనకు రాజ్యసభ ఇవ్వకపోవడంతో
మైసూరా రెడ్డి ఇక రాజకీయాలకు స్వస్తీ
చెప్పి తన బిజినెస్ వ్యవహారాలు
చూసుకునే అవకాశం ఉందనే ప్రచారం అప్పట్లో
జరిగింది. కానీ తాజాగా జగన్
వైపు వెళతారనే ప్రచారం గమనార్హం. అయితే జగన్ వైపు
వెళ్లే వార్తలను మైసూరా వర్గం కొట్టి పారేస్తుందట.
మరోవైపు ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి
నేత గొట్టిపాటి నరసయ్య కూడా వైయస్సార్ కాంగ్రెసులోకి
వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన జగన్ను,
వైవి సుబ్బారెడ్డిని కలిశారని సమాచారం.
0 comments:
Post a Comment