టాలీవుడ్
మన్మధుడు అక్కినేని నాగార్జున ఫిల్మ్ స్కూల్ విద్యార్థులకు నటనలో పాఠాలు నేర్పేందుకు
రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఇందులోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని నాగార్జునే
స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.
అక్కినేని
వారి అన్నపూర్ణ స్టూడియోలో ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్(ISFM)లో ఆయన ఈ
పాఠాలు చెప్పనున్నారు. ఇటీవల ఓ వార్తా
పత్రికకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....ఫిల్మ్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొంత
సమయం కేటాయించినట్లు వెల్లడించారు. ఆయన సమయంలో ఆయన
వారికి సినిమా పాఠాలు చెప్పనున్నట్లు తెలుస్తోంది.
కొత్తవారిని
ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నాగ్ తన కెరీర్లో
ఎంతో మందికి అకాశాల పరంగా చేయూతనిచ్చి పైకి
తీసుకొచ్చారు. తాజాగా తనకు వచ్చిన సినిమా
కళను కూడా విద్యార్థులకు స్వయగా
నేర్పడానికి సిద్ధం అవ్వడం నిజంగా అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.
అన్నపూర్ణ
స్టూడియోను కూడా నాగ్ మరింత
విస్తరిస్తున్నారు. వంద కోట్లు పెట్టుబడి
పెట్టి తమ అన్నపూర్ణ స్టూడియోని
మరింత మోడ్రన్ గా మార్చామని కొన్ని
రోజుల క్రితం ప్రకటిచారు. బాలీవుడ్, హాలీవుడ్ అవసరాలు తీర్చటం తమ టార్గెట్ అని,
అందుకోసం ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసానని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం
నాగార్జున రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘షిరిడిసాయి’ చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు ఆయన
నటించిన భారీ బడ్జెట్ తో
సోషియో ఫాంటసీ చిత్రం ఢమరుకం ఈ సమ్మర్ లోనే
విడుదల కానుంది. ఢమరుకం చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో
ఆర్.ఆర్. మూవీ మేకర్స్పై వెంకట్ నిర్మిస్తురు.
0 comments:
Post a Comment