హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి
కాంగ్రెసు పార్టీ గురించి తెలియదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు
గురువారం అన్నారు. పాలడుగు మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడారు. వైయస్కు కాంగ్రెసు
గురించి ఏమీ తేలియదని అలా
అని తెలుసుకోవాలని ప్రయత్నాలు కూడా చేసే వాడు
కాదని విమర్శించారు.
తనకు
మంత్రి పదవి ఇవ్వకుండా దివంగత
ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర
రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి
అలాగే ప్రస్తుత తమిళనాడు గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి
రోశయ్య అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని లక్షా నలభై వేల
ఎకరాల భూములను ప్రభుత్వం వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తారా
చౌదరి కేసులోని నేతల పేర్లు అయినా
బయటకు వస్తాయేమో కానీ భూములు ఆక్రమించుకున్న
వారి పేర్లు మాత్రం బయటకు రావని ఆయన
విమర్శించారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూములు వెనక్కి వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములు ఇస్తే అక్కడ వారికి
ఇళ్లు కట్టివ్వ వచ్చునని ఆయన చెప్పారు.
కాగా
ఇటీవల వైయస్ రాజశేఖర రెడ్డి
పైన కాంగ్రెసు పార్టీ నేతలు మండిపడుతున్న విషయం
తెలిసిందే. మంత్రి కొండ్రు మురళీ మోహన్ ఏకంగా
వైయస్ను దళిత వ్యతిరేకి
అంటూ మండిపడ్డారు. దళితాలకు ఆయన హయాంలో చేసింది
ఏమీ లేదని ఆరోపించారు.
0 comments:
Post a Comment