బాలీవుడ్లో భారీ విజయం
సాధించిన సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రాన్ని
ఆధారంగా చేసుకొని టాలీవుడ్ పవర్ స్టార్ పవన్
కళ్యాన్ హీరోగా 'గబ్బర్ సింగ్' పేరుతో ఓ సినిమా త్వరలో
ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ
సినిమాలో పవన్ ఎప్పటి లాగే
చిలిపిగా నటించడమే కాకుండా, ఇటు మాస్ ప్రేక్షకులను
సైతం ఆకట్టుకునేందుకు భారీ యాక్షన్ సన్నివేశాల్లో
కూడా నటించి మెప్పించనున్నారు.
ఇక్కడున్న
ఫోటోను చూడండి. ఇది గబ్బర్ సింగ్
సినిమాలోని ఓ వర్కింగ్ స్టిల్.
దీన్ని బట్టి చూస్తుంటే, ఈ
సినిమాలో మాంచి కార్ చేజింగ్
సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్ తెలుగు
సినిమాల్లో సుమోలు, స్కార్పియోలను గాల్లోకి ఎగరేయటం సర్వసాధారణమే అయినప్పటికీ, గబ్బర్ సింగ్ సినిమాలో మాత్రం
ఈ సన్నివేశాలను కాస్తంత భిన్నంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
గబ్బర్
సింగ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించనున్న
పవన్ కళ్యాన్ కోసం ప్రత్యేకంగా ఓ
జీప్‌ను మోడిఫై చేయించారు.
ఈ జీప్ ఫ్రంట్ బానెట్‌పై దేశీ తపంచా
(పురాతన హ్యాండ్ మేడ్ పిస్టోల్ లేదా
హ్యాండ్ గన్) ఆకారంలో ఉండే
ఓ తుపాకీని అమర్చారు. ఈ యాక్షన్ సన్నివేశాలను
అడవులు, కొండలు గుట్టలు వంటి ప్రాంతంలో చిత్రీకరించడంతో,
ఆఫ్-రోడ్ రైడింగ్‌కు
సరిపోయే విధంగా, ఈ జీప్‌కు
విశాలమైన, వెడల్పాటి పెద్ద టైర్లను ఉపయోగించారు.
ఈ చక్రాలకు 5-స్పోక్ అల్లాయ్ వీల్‌ను అమర్చటం
మరొక ప్రత్యేకమైన మోడిఫికేషన్గా చెప్పుకోవచ్చు.
ఒకప్పుడు
ఆఫ్-రోడింగ్ ప్రయాణాలకు, పల్లె ప్రాంతాల్లో ప్రజల
రవాణా వాహనంగా ఉపయోగించిన ఈ జీప్ ప్రస్తుతం
మెల్లిగా కాలగమనంలో కలిసిపోతున్న సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ,
పవన్ కళ్యాన్ ద్వారా ఈ సినిమాలో జీప్‌కు మళ్లీ ప్రాణం
పోసినట్లవుతుందని చెప్పవచ్చు. మొత్తమ్మీద ఈ సినిమాలో స్కార్పియో
కార్ ఛేజింగ్ సన్నివేశం హైలైగా ఉండొచ్చని తెలుస్తోంది.
రవితేజ
మిరపకాయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ గబ్బర్
సింగ్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్
కుమార్తె శృతి హాసన్ ఈ
సినిమాకు హీరోయిన్. వచ్చే నెల రెండవ
వారంలో ఈ సినిమా విడుదల
కావచ్చని అంచనా.
0 comments:
Post a Comment