వెస్పా
స్కూటర్ విడుదల గురించి గడచిన మార్చి నెలలో
డ్రైవ్ స్పార్క్ ప్రచురించినట్లుగానే, పియాజ్జియో తమ ప్రీమియం లైఫ్
స్టయిల్ స్కూటర్ వెస్పా "ఎల్ఎక్స్ 125" దేశీయ విపణిలోకి విడుదల
చేసింది. తొలుత మహారాష్ట్ర మార్కెట్లో
విడుదలైన వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ దశల వారీగా దేశ్యావ్యాప్తంగా
అందుబాటులోకి రానుంది. వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ను తొలిసారిగా 2012 ఢిల్లీ
ఆటో ఎక్స్పోలో పియాజ్జియో
ఆవిష్కరించింది.
వెస్పా
ఎల్ఎక్స్ 125 స్కూటర్లో ఉపయోగించిన 124సీసీ
సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్పిఎమ్ వద్ద
10.26 బిహెచ్పిల శక్తిని, 6000 ఆర్పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ల టార్క్ను
విడుదల చేస్తుంది. ఇండియాలో లభిస్తున్న స్కూటర్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది
(పవర్ఫుల్). వెస్పా ఎల్ఎక్స్ 125లో సివిటి (కంటిన్యూస్లీ
వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్బాక్సును ఉపయోగించారు.
వెస్పా
ఎల్ఎక్స్ 125లో ఆరు ఆకర్షనీయమైన
రంగుల్లో లభ్యం కానుంది. దీని
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్
లేదా కిక్ స్టార్ ఆప్షన్లతో
లభిస్తుంది. ఎయిర్క్రాఫ్ట్లలో
ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు
మాత్రమే ఉండే సస్పెన్షన్)ను
ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ
(ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా
ఎల్ఎక్స్ 125 మాత్రమే.
ఇండియన్
కస్టమర్ల కోసం ఎక్స్క్లూజివ్
యాక్ససరీస్, మర్చండైస్లను కూడా పియాజ్జియో
ఆఫర్ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 35 ప్రధాన నగరాల్లో 50 షోరూమ్లను ఏర్పాటు చేసి,
అక్టోబర్-నవంబర్ 2012 నాటికి ప్రతి నెలా 12,000 వెస్పా
స్కూటర్లను విక్రయించాలని పియాజ్జియో లక్ష్యంగా పెట్టుకుంది. భారత మార్కెట్లో వెస్పా
స్కూటర్ ధరను రూ.66,661 (ఎక్స్-షోరూమ్, మాహారాష్ట్ర)గా నిర్ణయించామని కంపెనీ
పేర్కొంది.








0 comments:
Post a Comment