ఒకటి
కాదు, రెండు కాదు ఏకంగా
14 సూపర్కార్లు ఒకేసారి ప్రమాదానికి గురై నుజ్జు నుజ్జు
అయిపోయాయి. ఎనిమిది ఫెరారీ కార్లు, మూడు మెర్సిడెస్ బెంజ్
స్పోర్ట్స్ కార్లు, ఒక టొయోటా ప్రయస్
హైబ్రిడ్ కారు, మరొక నిస్సాన్
స్కైలైన్ మరియు ఇంకొక బుగాటి
సూపర్కార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి.
ఈ దుర్ఘటన జపాన్లో చోటుచేసుకుంది.
దాదాపు 20 మంది సూపర్కార్
యజమానులు హిరోషిమా వైపుకు వెళ్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది.
రోడ్డు తడిగా ఉన్నందున ఈ
ప్రమాదం సంభవించి ఉండచ్చని భావిస్తున్నారు. వీరంతా హిరోషిమాలోని ఆటో షోకు వెళ్తుండగా
ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బహుశా ప్రపంచంలోనే అత్యంత
ఖరీదైన రోడ్డు ప్రమాదం కావచ్చోమే.
ఎందుకంటే,
ఈ ప్రమాదం విలువ జస్ట్ రూ.20
కోట్లకు పైమాటే. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఏ
ఒక్కరూ మరణించలేదు. దాదాపు 10 మంది వరకూ ఓ
మోస్తరు గాయాలతో బయటపడ్డట్లు సమాచారం. సూపర్కార్లలో భద్రతా
ఫీచర్ల కారణంగా ఇంత తీవ్రమైన ప్రమాదం
జరిగినప్పటి తాము ప్రాణాలతో బయటపడ్డామని
బాధితులు వాపోతున్నారు.







0 comments:
Post a Comment