వేలంపాటలో
పది రూపాయల విలువ చేసే వస్తువును
ఎవరైనా పది లక్షల రూపాయాలకు
కొంటారా..? ఇలాంటివి సినిమాల్లోనే సాధ్యమవుతాయంటారా..? సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ
ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. పంజాబ్లోని ఓ వ్యక్తి
కేవలం రూ.45,000 విలువ చేసే అతని
స్కూటర్ కోసం రూ.12 లక్షల
ఖరీదైన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ను కొనుగోలు చేసి
అందరినీ విస్మయానికి గురి చేశాడు.
పంజాబ్లోని ముక్స్తర్కు
చెందిన రికీ బ్రార్ అనే
యువ రైతు "PB 30 J 0003"
అనే విఐపి నెంబర్ కోసం
వేలంలో రూ.12 లక్షలు చెల్లించి
కొనుగోలు చేశాడు. ప్రిస్టీజ్ కోసం రికీ తన
చేతులు కాల్చుకున్నాడు. రికీ ప్రత్యర్థి తన
మెర్సిడెస్ బెంజ్ కారుకు ఈ
ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో పాల్గొన్నాడు.
ఈ నెంబర్ కోసం అతను పది
లక్షల వరకూ పలిగి ఆగిపోవటంతో
రికీ తన రూ.45,000 ఎల్ఎమ్ఎల్
స్కూటర్ కోసం రూ.12 లక్షలు
చెల్లించాల్సి వచ్చింది.
నెంబర్
3, 7 లంటే తనకు చాలా క్రేజ్
అని, తన స్కార్పియో కార్
కోసం ఇప్పటికే 0007 నెంబర్ను సొంతం చేసుకున్నానని
రికీ బ్రార్ చెప్పుకొచ్చాడు. వెర్రి వేయి విధాలంటారు. అందులో
ఇది కూడా ఒకటేమో.
0 comments:
Post a Comment