యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన
‘ దమ్ము’ చిత్రం
ఈ రోజు ప్రపంచ వ్యాప్తగా
భారీ అంచనాల మధ్య 1200 పైచిలుకు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో జూ
ఎన్టీఆర్ రామచంద్ర, విజయ ధ్వజ సింహ
పాత్రల్లో కనిపించారు. త్రిష అతని ప్రియురాలి
పాత్రలో, కోట శ్రీనివాసరావు తాత
పాత్రలో, సుమన్ తండ్రి పాత్రలో,
భానుప్రియ తల్లి పాత్రలో, వేణు
బావ పాత్రలో నటించారు.
ఈ చిత్రం ముఖ్యంగా రెండు వంశాల మధ్య
గొడవను బేస్ చేసుకుని రూపొందించారు.
వాసిరెడ్డి వంశానికి.... వాళ్ల ప్రత్యర్థులైన నాజర్
వంశానికి మధ్య ఆధిపథ్య పోరు
నేపథ్యంలో ఇరు వర్గాలు సందు
దొరికినప్పుడల్లా ఒకరినొకరు వేసుకోవడమే పనిగా పెట్టుకుంటారు. ఈ
క్రమంలో వాసిరెడ్డి వంశంలో మగాడు అంటూ లేకుండా
పోతాడు. అలా 25 ఏళ్లు గడిచిపోతాయి.
సిటీలో
ఉండే రామచంద్ర(ఎన్టీఆర్) కొంత డబ్బు సంపాదించి
బ్యాంకులో వేసుకుని దానిమీద వచ్చే వడ్డీతో హాయిగా
కాలం వెల్లదీద్దాం అని ఆలోచించే రకం.
అతని ప్రియురాలు సత్య. అనుకోని పరిస్థితుల
నేపథ్యంలో వాసిరెడ్డి వంశంలోకి విజయ ధ్వజ సింహగా
దత్తత వెళతాడు. ఆ వంశం వాడిగా
తన దమ్మేంటో ప్రత్యర్థి వర్గానికి చూపెడతాడు.
చిత్రంలో
ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు హై వోల్టేజీలో ఉన్నాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పే డైలాగులు సినిమాకే హైలెట్ గా నిలియాయి. అభిమానుల
అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉంది. అయితే సినిమాలో
కొన్ని మైనస్ పాయింట్లు కూడా
ఉన్నాయి. అవేమిటో సమీక్షలో పరిశీలిద్దాం.
0 comments:
Post a Comment