రాజమౌళి
తాజా చిత్రం 'ఈగ'త్వరలో విడుదలకు
రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ
చిత్రం ప్రమోషన్ ని పెంచారు రాజమౌళి.
ఫేస్ బుక్,ట్విట్టర్,మీడియా,టీవీ ఛానెల్స్ అనే
తేడా లేకుండా ఈ చిత్రాన్ని భారీ
లెవల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఆయన తాజాగా ఈ
చిత్రం కధ గురించి చెబుతూ
తమ చిత్రం నాని, బిందుల మధ్య
లవ్ స్టోరీ అన్నారు. నాని పాత్రలో నాని,బిందు పాత్రలో సమంత
నటిస్తోంది అన్నారు. మధ్యలో సుదీప్ పాత్ర ప్రవేసించి ఏమి
చేసిందనేదే కథ అంటున్నారు.
ఆయన మాటల్లోనే...ఆ అబ్బాయి పేరు
నాని. పెళ్లీడు వచ్చేసిన కుర్రాడు. ఓ రోజు బిందు
అనే అందాల భామని చూసి
మనసు కూడా పారేసుకొన్నాడు. రోజులు,
నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మూగగా ఆరాధిస్తాడే తప్ప
ప్రేమ విషయం చెప్పడు. ఇదంతా
బిందుకీ సరదాగానే ఉంది. ఓ రోజు
ధైర్యం చేసి 'ఐ లవ్
యూ' చెప్పేద్దాం అనుకొన్నాడు. అప్పుడే కథలోకి మరో పాత్ర ప్రవేశించింది.
నాని, బిందుల మధ్య అడ్డుగోడలా నిలిచింది.
అతనెవరు? ఈ ప్రేమ కథ
ఏ మలుపు తిరిగింది? అనే
విషయాలు మా సినిమా చూసి
తెలుసుకోవల్సిందే అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి.
గ్రాఫిక్స్
ప్రధానాంశంగా రూపొందుతున్న 'ఈగ'చిత్రంలో నాని,
సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ
''కెమెరా కంటికే స్పష్టంగా చిక్కనంత చిన్న ప్రాణి 'ఈగ'.
ఓ బలవంతుడైన మనిషితో వైరం పెంచుకొంది. అతన్ని
ఓడించడానికి ఎలాంటి ఎత్తులు వేసింది? ఎన్ని సాహసాలు చేసింది?
అనేదే కథలో కీలకం. ప్రతినాయకుడిపై
ఈగ ఎలా విజయం సాధించిందీ
అన్నది ఆసక్తికరం. ఆ సన్నివేశాల్ని విజువల్
ఎఫెక్ట్స్‌లో తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే విడుదల
తేదీ ప్రకటిస్తామని''అన్నారు.
ఈ చిత్రంపై రాజమౌళి చాలా కాన్ఫిడెండ్ గా
ఉన్నారు. అలాగే ఈగ బడ్జెట్
ముప్పై కోట్లు దాటిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చాలా
చిన్న బడ్జెట్ అనుకుని నాని వంటి చిన్న
హీరోతో ప్రారంభించిన ఈ చిత్రం అనుకోని
విధంగా గ్రాఫిక్స్ హంగామాతో ఈ రేంజి బడ్జెట్
అయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే రాజమౌళి కి
ఉన్న బిజినెస్ స్టామినాని బట్టి ఈ మొత్తం
పెద్దది కాదని,సినిమాపై ఉన్న
భారీ అంచనాలు,మిగతా భాషల్లోకి వెళ్లే
అవకాసం ఇవన్నీ బడ్జెట్ కు సహకరించే అంశాలు
అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం
ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో
ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి
చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు
తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే
కథ కావటం సినిమాపై అంచనాలు
పెంచుతున్నాయి. పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద
మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల
అంటున్నారు.
‘ఈగ’ సబ్జెక్ట్
సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో
హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న
ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్
చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత
జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై
ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ
ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన
ఓ మనిషిపై..అదీ ఓ పరమ
క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం
ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం. ఇక ఈ చిత్రానికి
సంగీతం కీరవాణి, స్టైలింగ్ ..రమా రాజమౌళి, ఛాయాగ్రహణం..సెంధిల్ కుమార్, సమర్ఫణ డి.సురేష్ బాబు
0 comments:
Post a Comment