ప్రముఖ
రచయిత, నటుడు తణికెళ్ల భరిణి
'మిథునం'అనే ఓ ఫీచర్
ఫిల్మ్ ని డైరక్ట్ చేస్తున్న
సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి
ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం
నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరమణ 'మిథునం' కథ ఆధారంగా రూపొందించిన
ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా విడుదల అయిన
ఈ చిత్రం పాటలు అందరినీ అలరిస్తున్నాయి.
త్వరలోనే ఈ చిత్రం విడుదల
కానుంది. ఈ చిత్రం విషేషాలను
ఆయన మీడియాతో పంచుకున్నారు.
ఈ చిత్రం గురించి తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఆ
ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. పదహారు ప్రాయమైతే ప్రేమలేఖలు రాసుకొనేవాళ్లు. అప్పుడే పెళ్త్లెన జంటైతే చిన్న స్పర్శతో ప్రేమను
వ్యక్తం చేసుకొని ఉండేవాళ్లు. కనీసం ముఫ్పైలో ఉన్నా
ముద్దుముచ్చట్లలో మునిగేవాళ్లు. కానీ మొన్నే షష్టిపూర్తయ్యింది.
ఆ వయసులో జీవితం అంతా పూర్తయిపోయిందనుకొంటారు.. ఎవరైనా! కానీ
వాళ్లకు మాత్రం అప్పుడే మొదలైంది. ఆ ప్రేమని ఎలా
వ్యక్తం చేసుకొన్నారో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే.
'ఆరుపదుల వయసులో కూడా నూతన దంపతుల్లా
కాలం గడిపే జంట ఎలా
ఉంటుందో చూపించే ప్రయత్నమిది. అచ్చ తెలుగు చిత్రమిది
అన్నారు తనికెళ్ల భరణి.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి
ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్
ముయిదా రావు నిర్మాత. న్యూయార్క్
లో మార్చి 31 వ తేదీన, డల్లాస్
లో ఏప్రియల్ 1న, న్యూ జర్సీలో
ఏప్రియల్ 7న ఆడియో విడుదల
జరిగింది. ఇక ఈ చిత్రంతో
భరిణి పూర్తి స్ధాయి ఫీచర్ ఫిల్మ్ దర్సకత్వంలోకి
దిగుతున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి
ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వావిలవలస గ్రామంలో సన్నివేశాల్ని తెరకెక్కించారు. 'మిథునం' చిత్రానికి వీణాపాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక గతంలో భరిణి
'సిరా', 'కీ', 'బ్లూ క్రాస్'
లాంటి లఘు చిత్రాలు రూపొందించి
పురస్కారాలు అందుకొన్నారు.
'మిథునం'
పూర్తిస్థాయి చలనచిత్రం. ఈ చిత్రం వృద్ధ
జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా
జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది.
ఇదే కథలో గతంలో మళయాళంలో
ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా
ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ
కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ
చూసేటట్లుగా రూపొందిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యంని
కీ రోల్ కి తీసుకున్నారు
కాబట్టి పాటలకు కూడా ప్రాధాన్యత ఉండేలా
చేస్తారేమో చూడాలి. రీసెంట్ గా ఎస్పీ బాలసుబ్రమణ్యం..దేవస్దానం అనే చిత్రంలో సైతం
చేసారు. జనార్ధన మహర్షి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది.
0 comments:
Post a Comment