హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో
దిగిన ఫోటో మిస్టరీని వ్యభిచారం
రాకెట్ కేసులో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి
పోలీసుల వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డితో తాను దిగిన ఫోటోను
చూపించి పలువురు ప్రముఖులను తారా చౌదరి బెదిరించినట్లు
వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాజశేఖర
రెడ్డితో తాను ఎలా దిగింది
ఆమె వెల్లడించిట్లు ఓ ప్రముఖ తెలుగు
టీవీ చానెల్ గురువారం తెలిపింది. వైయస్తో తారా
చౌదరి దిగిన ఫొటోను పోలీసులు
స్వాధీనం చేసుకున్నారు.
తారా
చౌదరి పోలీసుల వద్ద వెల్లడించిన విషయాలంటూ
ఆ టీవీ చానెల్ ఓ
వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఆ వార్తాకథనం ప్రకారం
- గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ కాంగ్రెసు నాయకుడి
సహాయంతో వైయస్ రాజశేఖర రెడ్డితో
తాను ఫొటో దిగినట్లు తారా
చౌదరి వెల్లడించింది. తారా చౌదరి జరిపిన
సంభాషణల రికార్డుల్లో ఓ పార్లమెంటు సభ్యుడి
గొంతును పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇతర ప్రముఖుల గొంతులను గుర్తించడానికి తారా చౌదరి నివాసం
నుంచి స్వాధీనం చేసుకున్న ఆడియో రికార్డులను ఫోరెన్సిక్
లాబరేటరీకి పోలీసులు పంపించారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, వ్యాపారవేత్తలతో జరిపిన సంభాషణలను ఆమె రికార్డు చేసినట్లు
పోలీసులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. తాను ప్రముఖులను, పోలీసు
అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు తారా చౌదరి తెలిపింది.
రాసలీలల
దృశ్యాలను పెన్ కెమెరాతో రికార్డు
చేసినట్లు ఆమె తెలిపినట్లు చెబుతున్నారు.
వాటితో తాను బెదిరించి, డబ్బులు
వసూలు చేసినట్లు ఆమె పోలీసుల వద్ద
అంగీకరించినట్లు చెబుతున్నారు. ఆరేళ్లుగా తాను ఆ వృత్తిలో
ఉన్నట్లు ఆమె చెప్పింది. విలాసాలకు
అలవాటు పడి ఈ పనులకు
ఒడిగట్టినట్లు ఆమె చెప్పింది. సినిమాల్లో
నటించేందుకు హైదరాబాద్ వచ్చి విలాసాలకు అలవాటు
పడినట్లు ఆమె తెలిపింది. వ్యభిచారంలోకి
దింపిన అమ్మాయిలకు తాను వారానికి పది
నుంచి 15 వేల రూపాయలు ఇచ్చినట్లు
ఆమె చెప్పినట్లు టీవీ చానెల్ వార్తాకథనం
సమాచారం. బిఎ చదివిన తర్వాత
సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చినట్లు ఆమె తెలిపింది. తాను
మూడు సినిమాల్లో నటించినట్లు ఆమె తెలిపింది.
తారా
చౌదరి అనుచరుడు హనీఫ్ కోసం పోలీసులు
గాలిస్తున్నారు. అతను ముంబైకి పారిపోయినట్లు
పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం ముంబైకి
పోలీసులు ఓ బృందాన్ని పంపించారు.
ముంబైకి చెందిన మన్ను అనే వ్యక్తి
కూడా తారా చౌదరి జట్టులో
ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ ముఠా ఆమెకు
సహకరిస్తూ వచ్చిందని చెబుతున్నారు.
0 comments:
Post a Comment