విజయవాడ/గుంటూరు: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నగర పార్టీ అధ్యక్షుడు
వల్లభనేని వంశీ కడప పార్లమెంటు
సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో త్వరలో చేరే అవకాశాలు ఉన్నాయని
జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల క్రితం
జగన్తో వంశీ విజయవాడలో
కలిసిన విషయం రాజకీయవర్గాల్లో తీవ్ర
చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన
ఏ క్షణమైనా జగన్ వైపు వెళతారని
ప్రచారం జరిగింది.
అయితే
తమ కలయిక కేవలం కాకతాళీయమే
అని, దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును
కలిసి తాను వివరణ ఇస్తానని
వల్లభనేని వంశీ చెప్పారు. తాను
టిడిపిని వీడే ప్రసక్తి లేదని
కుండబద్దలు కొట్టారు. అయితే పైకి వంశీ
తాను పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పినప్పటికీ
దాదాపు ఆయన జగన్ పార్టీలోకి
వెళ్లేందుకు మానసికంగా సిద్ధమైపోయారనే ప్రచారం జరుగుతోంది. వంశీని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు గుంటూరు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు నేత మధ్యవర్తిత్వం వహిస్తున్నారని
అంటున్నారు.
వంశీతో
పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా జగన్ పార్టీ
వైపు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి జగన్.. వల్లభనేని వంశీతో ఫోన్లో మాట్లాడినట్లు
జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాను పార్టీని వీడేది
లేదని వంశీ చెప్పినప్పటికీ ఆ
తర్వాత జగన్తో ఫోన్
సంభాషణలు జరపడం అంటే ఆయన
జగన్తో వెళ్లేందుకు సిద్ధమైనట్లేననే
వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే
వంశీ ఒక్కడే కాకుండా మరో నలుగురు ఎమ్మెల్యేలను,
రెండు జిల్లాలకు చెందిన పలువురు ముఖ్య నేతలను తన
పార్టీలోకి తీసుకు వచ్చేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నారని
అంటున్నారు. వల్లభనేని వంశీ ఎఫెక్ట్తో
గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పలువురు నేతలు ఉప ఎన్నికల
తర్వాత జగన్ పార్టీలో చేరనున్నారని
అంటున్నారు.
కాగా
తెలుగుదేశం పార్టీ నేతలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామన్న
వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత లేల్ల అప్పిరెడ్డి
కొట్టి పారేశారు. తాము నాయకులతో సంప్రదింపులు
జరపాల్సిన అవసరం లేదని, జగన్కు వస్తున్న ఆదరణ
చూసి, ఉప ఎన్నికల ఫలితాలు
చూసి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు నలబై మంది
ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారని చెప్పారు.
మరోవైపు
అసలైన టిడిపి నేతలు ఎవరూ తెలుగుదేశం
పార్టీని వదిలి వెళ్లరని టిడిపి
నేతలు చెబుతున్నారు. వంశీ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
ఎందుకు కలిశారో ఆయనే చెప్పాలన్నారు. టిడిపిని
నామరూపాలు లేకుండా చేస్తానని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
అన్నారన్నారు. కానీ ప్రజల అండ
ఉన్న టిడిపిని ఎవరూ నిర్వీర్యం చేయలేరన్నారు.
0 comments:
Post a Comment