హైదరాబాద్: రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు హైదరాబాద్‌కు
వచ్చిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వాయలార్ రవిని రాష్ట్ర కాంగ్రెస్
వ్యవహారాల ఇంచార్జ్‌గా అధిష్టానం నియమించినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలు
పూర్తయ్యే వరకు వాయలార్ రవియే రాష్ట్ర బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, గులాం నబీ ఆజాద్ తీరుపై రాష్ట్రంలోని పలువురు
నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాయలార్ రవిని ఉప ఎన్నికల
వరకు అధిష్టానం ఇంచార్జిగా నియమించినట్లుగా తెలుస్తోంది.
వాయలార్ రవి వచ్చీ రాగానే బిజీ బిజీగా గడుపుతున్నారు. పలువురు నేతలతో భేటీ అవుతున్న ఆయన రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కెవిపి రామచంద్ర రావు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. పరిస్థితులపై వివరించారు.
ఉప ఎన్నికల బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానం ఫలితాలు కాంగ్రెసుకు అనుకూలంగా ఉంటే వాయలార్ రవినే పూర్తిస్థాయి ఇంచార్జ్‌గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆజాద్ పైన తెలంగాణ నేతలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ సమన్వయం చేసినా కుదరదనే ఉద్దేశ్యంతో అధిష్టానం వాయలార్ రవిని రంగంలోకి దింపి ఉండవచ్చునని అంటున్నారు.
ఉప ఎన్నికలు అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ సమయంలో ఇక్కడి గురించి పూర్తిగా తెలిసిన, సమన్వయపర్చగల రవిని పంపించి ఉంటారని అంటారు. కాగా మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇక్కడి నేతలను కలిసేందుకే వచ్చానని, తరుచూ వారిని కలిసేందుకు వస్తుంటానని చెప్పారు. తాను ఇంచార్జిని కాదని ఆజాదే ఇంచార్జ్ అని చెప్పారు.
మరోవైపు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు బుధవారం సాయంత్రం హైదరాబాదులో సమావేశం కానున్నారు. తెలంగాణ ఆవశ్యకతను వాయలార్ రవికి చెప్పే అంశంపై వారు చర్చించనున్నారు. తెలంగాణ ఇస్తే ఇరు ప్రాంతాలలో పార్టీకి ఎలాంటి నష్టం లేదని, ఇవ్వకుంటే మాత్రం తెలంగాణలో కాంగ్రెసుకు నష్టమని వారు ఆయన దృష్టికి తీసుకు వెళ్లే అవకాశముంది. కాగా రవిని కలిసేందుకు రాష్ట్ర నేతలు క్యూ కట్టారు.

0 comments:
Post a Comment