Friday, April 13, 2012

Vijay sai reddy got bail in ys jagan property case


హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టులను తమకు అప్పగించాలని కోర్టు విజయ సాయిరెడ్డిని ఆదేశించింది.

హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు ఆయనకు షరతు విధించింది. అదే విధంగా ఇద్దరు వ్యక్తులతో రూ. 25 వేల రూపాయలేసి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డిని సిబిఐ జనవరి 2 తేదీన అరెస్టు చేసింది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టయింది ఆయన ఒక్కరే. ఆయనపై సిబిఐ కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. విజయసాయి రెడ్డిని వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడిగా చేర్చింది.

విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సిబిఐ కోర్టులో గట్టిగా వాదించింది. విజయసాయి రెడ్డి బెయిల్ అమలును నెల 16 తేదీ వరకు నిలిపేయాలని సిబిఐ కోర్టును కోరింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలక సూత్రధారి విజయసాయి రెడ్డేనని సిబిఐ వాదిస్తూ వస్తోంది. వివిధ కంపెనీల నుంచి వైయస్ జగన్ సంస్థల్లోకి నిధుల మళ్లింపులో విజయసాయి రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించారని సిబిఐ ఆరోపించింది. విజయసాయి రెడ్డి ఇంతకు ముందు రెండుసార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే అప్పుడు కోర్టు బెయిల్కు నిరాకరించింది.

కాగా, విజయసాయి రెడ్డి అక్రమమంటూ ఆయన తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. వైయస్ జగన్ కుటుంబానికి విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక సలహాదారు మాత్రమేనని, లావాదేవీలతో ఆయనకు సంబంధం లేదని సుశీల్ కుమార్ వాదించారు. విజయసాయి రెడ్డిని రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడు బిపి ఆచార్య విషయంలో సిబిఐ అదే పని చేసింది.

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget