హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్ ఆస్తుల కేసులో
రెండో నిందితుడు విజయసాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు
మరోసారి బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు కోర్టు షరతులతో
కూడిన బెయిల్ను సోమవారం మంజూరు
చేసింది. ఇంతకు ముందు సిబిఐ
కోర్టు ఇచ్చిన బెయిల్ను హైకోర్టు రద్దు
చేసింది. దాంతో విజయసాయి రెడ్డి
లొంగిపోయి మరోసారి సిబిఐ కోర్టులో బెయిల్కు పిటిషన్ దాఖలు
చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు బెయిల్
మంజూరు చేసింది. పాస్పోర్టును కోర్టులో
సమర్పించాలని విజయసాయి రెడ్డిని ఆదేశించింది.
హైదరాబాద్
విడిచి వెళ్లరాదని కోర్టు విజయసాయి రెడ్డిని ఆదేశించింది. అలాగే, సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని
కూడా ఆదేశించింది. బెయిల్ కోసం ఇద్దరు వ్యక్తులతో
25 రూపాయలేసి వ్యక్తిగత పూచీకత్తు ఇప్పించాలని కోర్టు విజయసాయి రెడ్డిని ఆదేశించింది. అయితే, విజయసాయి రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ అమలును
మూడు రోజుల పాటు ఆపాలని
సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.
వైయస్ జగన్ సంస్థలకు విజయసాయి
రెడ్డి కేవలం ఆడిటర్గా
మాత్రమే వ్యవహరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది
వాదించగా, వైయస్ జగన్తో
కలిసి విజయసాయి రెడ్డి కుట్ర చేశారని సిబిఐ
వాదించింది.
విజయ
సాయి రెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ
కోర్టు ఏప్రిల్ 20వ తేదీన హైకోర్టు
తీర్పును ఇచ్చింది. సిబిఐ ప్రత్యేక కోర్టు
ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది.
దీంతో విజయసాయి రెడ్డి 23వ తేదీన కోర్టులో
లొంగిపోయారు. ఏప్రిల్ 13వ తేదీన విజయ
సాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు
మొదటిసారి బెయిల్ లభించింది. విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు ఇచ్చిన
బెయిల్ను మరోసారి హైకోర్టులో
సవాల్ చేసేందుకు సిబిఐ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
వైయస్
జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి రెండో నిందితుడు. వైయస్
జగన్ రెండో నిందితుడు. విజయసాయి
రెడ్డిపై అభియోగాలు మోపుతూ సిబిఐ కోర్టులు చార్జిషీట్
కూడా దాఖలు చేసింది. వైయస్
జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సిబిఐ విజయసాయి
రెడ్డిని మాత్రమే అరెస్టు చేసింది. విజయసాయి రెడ్డిని జనవరి 2వ తేదీన సిబిఐ
అరెస్టు చేసింది.
0 comments:
Post a Comment