జర్మనీకు
చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ
ఫోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ పోలో, ఎంట్రీ లెవల్
సెడాన్ వెంటో కార్లలో సిఎన్జి వేరియంట్లను
ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని
ప్రధాన మెట్రో నగరాల్లో సిఎన్జి ఇంధనంతో
నడిచే కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో, ఫోక్స్‌వ్యాగన్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న
ఈ రెండు వేరియంట్లలో కూడా
సిఎన్జి వెర్షన్లను విడుల
చేయాలని కంపెనీ భావిస్తోంది.
భవిష్యత్తులో
మరిన్ని కార్లను ఇండియాకు తీసుకురానున్నామని, ఇందులో భాగంగానే పోలో, వెంటో మోడళ్లలో
సిఎన్జి వేరియంట్లను తీసుకువస్తామని
ఫోక్స్‌వ్యాగన్ డైరెక్టర్ (ప్యాసింజర్ కార్ సేల్స్) నీరజ్
గార్గ్ తెలిపారు. ప్రస్తుతం పోలో, వెంటో కార్లు
పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో
లభిస్తున్నాయి. కాగా.. ఐపిఎల్ సీజన్ సందర్భంగా ప్రస్తుతం
ఈ రెండు వేరియంట్లలో ఐపిఎల్
ఎడిషన్లను అందిస్తున్న సంగతి
తెలిసిందే.
0 comments:
Post a Comment