హనాల్లో
టింటెడ్ గ్లాస్ వెనుక ఉన్న ప్రమాదాల
గురించి గతంలో తెలుగు డ్రైవ్
స్కార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన
సంగతి తెలిసిందే. అక్రమాలకు, తీవ్రవాద కార్యకలాపాలకు, అత్యాచారాలకు అడ్డాగా మారుతున్న ఇలాంటి అధిక టింట్/సన్
ఫిల్మ్ (కారు అద్దాలపై కవర్
చేసే నల్లటి స్టిక్కర్) కలిగిన వాహనాలపై సుప్రీం కోర్ట్ కొరడా ఝుళిపించింది.
ఈ మేరకు పరిమితులకు మించి
వాహనాల విండ్షీల్డ్స్ (ముందు,
వెనుక అద్దాలు), సైడ్ మిర్రర్స్ (డోర్కు అమర్చబడి ఉండే
అద్దాలు)కు టింట్ చేయించటం,
నల్లటి సన్ ఫిల్మ్లు
ఉపయోగించటాన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ అంశంపై వెంటనే
చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన
న్యాయమూర్తి ఎస్ హెచ్ కపాడియా,
న్యాయమూర్తి ఎకె పట్నాయక్, స్వతంతర్
కుమార్లు ఈ ఆదేశాలు
జారీ చేశారు. మోటార్ వాహన చట్టం కూడా
అద్దాలకు ఎక్కువ నలుపు రంగు కలిగిన
సన్ఫిల్మ్లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తుంది.
మోటార్
వాహన చట్టం ప్రకారం, కారు
విండ్స్క్రీన్స్ (ముందు వైపు మరియు
వెనుక వైపు కారు అద్దాలు)
70 శాతం మాత్రమే టింట్ చేయబడాలి. అలాగే,
కారుకు పక్కల ఉండే అద్దాలకు
(కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 శాతం పారదర్శకతను కలిగిన
టింట్/సన్ఫిల్మ్ను
మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ
టింట్ చేసినట్లయితే, అది మోటార్ వాహన
చట్టాన్ని ఉల్లఘించబడినట్లుగా గుర్తించి, ట్రాఫిక్ పోలీసుల చే జరిమానాను ఆహ్వానించబడుతుంది.
సాధారణంగా
ప్రస్తుతం పరిమితులకు మించి వాహనాలకు సన్ఫిల్మ్లను ఉపయోగించినట్లయితే జరిమానాగా
రూ.100 లను వసూలు చేయడం
జరుగుతుంది. అయితే, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఈ
జరిమానా మొత్తాన్ని రూ.500 లకు పెంచాలని ప్రతిపాదించడమైనది.
ఈ మేరకు అవసరమైన సవరణలను
మోటార్ వాహన చట్టంలో చేయనున్నారు.
మే 4, 2012వ తేదీ నుండి
స్పష్టమైన పారదర్శకత లేని సన్ఫిల్మ్లు ఉపయోగించిన వాహనాలపై
జరిమానాలు భారీగా విధించనున్నారు.
0 comments:
Post a Comment