హైదరాబాద్:
పులినే గదిలో పెట్టి కొట్టడానికి
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆ పులి పంజా
విసురుతుందని, ఆ పంజా దెబ్బకు
ఆ పార్టీలు పలాయనం చిత్తగించడం తథ్యమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం
అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు,
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. జగన్
వంటి పులినే గదిలో పెట్టే ప్రయత్నాలతో
వారికి పలాయనం తప్పదన్నారు.
వైయస్
జగన్కు ప్రజలలో వస్తున్న
ఆదరణ చూసి ఓర్వలేకే తెలుగుదేశం,
కాంగ్రెసు పార్టీలు ఆయన ఇమేజ్ను,
తమ పార్టీని దెబ్బ తీసేందుకు కుట్రలు
చేస్తున్నాయన్నారు. జగన్ను అణిచి
వేయాలని చూస్తే ప్రజాస్వామ్యయుతమైన ఆందోళనలు వస్తాయన్నారు. ఉప ఎన్నికలలో తమ
పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.
ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు
కూడా దక్కవన్నారు.
తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ఎవరి
సలహాలు అవసరం లేదని విజయవాడ
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు సూచించారు. ప్రభుత్వం
తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు.
మాజీ
మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పరిటార రవీంద్ర
హత్య తర్వాత ఆ పార్టీ అధినేత
నారా చంద్రబాబు నాయుడే రెచ్చగొట్టి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని రోజా ఆరోపించారు. ఏఐసిసి
అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడు
రాహుల్ గాంధీకి పెళ్లి చేసి ఓ మంచి
తల్లి అని నిరూపించుకోవాలని సూచించారు.
మాజీ
మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఇంటి భోజనం వెళుతోందని
ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె
ప్రకాశ్ రావు అన్నారు. జ్యూడిషియల్
రిమాండులో ఉన్న వ్యక్తిని మంత్రులు
ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై మంత్రులు సంజాయిషీ ఇవ్వాలన్నారు. గాలి జనార్ధన్ రెడ్డికి
టి ఇస్తేనే కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారని,
కానీ మోపిదేవికి ఇంటి భోజనం ఎలా
ఇస్తున్నారన్నారు.
విజయవాడ
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తన స్థాయిని మించి
మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేత
జలీల్ ఖాన్ విజయవాడలో అన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, లగడపాటి
రాజగోపాల్ తమ పార్టీ కార్యకర్తలను
రెచ్చగొడుతున్నారన్నారు.
జరగరాని ఘటనలు ఏమైనా జరిగితే
వారిదే బాధ్యత అన్నారు.
0 comments:
Post a Comment