పవన్కల్యాణ్ ‘దబాంగ్’ రీమేక్ చేయబోతున్నారని తెలిసినప్పటినుంచి ఆయన అభిమానులు హిందీ
సినిమా డీవీడీలు తెచ్చుకొని చూశారు. ఎవరికి వారు సినిమా ఇలా
వుండాలి....అలా వుండాలి అంటూ
స్క్రిప్ట్లు రాసి పంపించారు
అన్నారు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్
శంకర్. ఆయన దబాంగ్ ని
తెలుగు నేటివిటికి మార్చే విషయం గురించి మాట్లాడుతూ
ఇలా స్పందించారు. దాంతో ‘దబాంగ్’ను యాజ్ ఇట్
ఈజ్గా తీస్తున్నామని అభిమానులు
భావిస్తారని తెలిసి మన నేటివిటీకి తగినట్లు,
పవన్ బాడీలాంగ్వేజ్కు అనుగుణంగా స్క్రిప్ట్లో మార్పులు చేశాను.
అందుకే టైటిల్స్‌లో ‘మార్పులు’ అనే
కార్డ్ను వేశాను అని
చెప్పారు.
‘గబ్బర్సింగ్’కు ముందే పవన్కల్యాణ్కు ఓ కథ
చెప్పాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా
కార్యరూపం దాల్చలేదు. అయితే నేను కథ
చెప్పిన విధానం నచ్చి పవన్కల్యాణ్
తప్పకుండా నాకు అవకాశం ఇస్తానని
మాటిచ్చారు. ‘దబాంగ్’ తెలుగు రీమేక్ చేద్దామనే ఆలోచన పవన్కల్యాణ్దే. ‘గబ్బర్సింగ్’ అనే
టైటిల్ కూడా ఆయనే పెట్టారు.
సౌత్ స్టైల్లో వుండే ‘దబాంగ్’ సినిమా నార్త్ వాళ్లకు చాలా కొత్త. స్ట్రైయిట్
చిత్రాల కంటే రీమేక్ సినిమాలు
చేస్తున్నప్పుడే దర్శకుడి మీద ఎక్కువ ఒత్తిడి
వుంటుంది. అయితే నా అభిమాన
నటుడు పవన్కల్యాణ్ను
డైరెక్ట్ చేస్తున్నాననే ఎగ్జైయిట్మెంట్లో ఒత్తిడి
మాయమై ఉత్సాహం వచ్చింది అన్నారు.
ఇక ‘గబ్బర్సింగ్’ తప్పకుండా సూపర్హిట్ చిత్రమవుతుందనే
నమ్మకం వుండేది. ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తుందని మాత్రం ఊహించలేదు. పవన్కల్యాణ్ ఫ్యాన్స్తో పాటు అన్ని
వర్గాలప్రేక్షకులు ఆదరించారు కాబట్టే ఇండస్ట్రీ హిట్గా దూసుకుపోతోంది.
గబ్బర్సింగ్ బ్లాక్బస్టర్
హిట్ పవన్కల్యాణ్ వల్లే
సాధ్యమయింది అన్నారు.
‘గబ్బర్సింగ్’ సినిమాలో డైలాగ్స్ గురించి మాట్లాడుతూ...పవన్ అభిమానిగా నా
సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఆటోమేటిక్గా ఆ డైలాగ్లు వచ్చాయి. ఆయనలోని
హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా డైలాగ్స్ రాసుకున్నాను. డైలాగ్స్ అనే కంటే వాటిని
మాటలు అనడం బాగుంటుంది. ఎందుకంటే
డైలాగ్స్లో కొంచె డ్రామా
వుంటుంది. మాటలు చాలా సహజంగా
వుంటాయి. ప్రేక్షకులు తొందరగా కనెక్ట్ అవుతారు. జనాలు మాట్లాడే భాషలో
సంభాషణలు వుండాలన్నది నా అభిప్రాయం అన్నారు.
తన తదపరి చిత్రాలు గురించి
చెపుతూ..జూనియర్ ఎన్టీఆర్తో వుంటుంది. కొడాలి
నాని నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన
పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను. అలాగే ప్రయోగాత్మక సినిమాలంటే
నాకు చాలా ఇష్టం. పారలల్
సినిమాలంటే చాలా మందికి భిన్న
అభిప్రాయం వుంది. హృషికేశ్ ముఖర్జీ సినిమాల్ని నేను బాగా ఇష్టపడతాను.
హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో, జీవితాల్లోని సంఘర్షణను ప్రతిబింబిస్తూ సినిమాలు చేయాలనే ఆలోచన వుంది. అందుకోసం
పూర్తిస్థాయిలో మూడు స్క్రిప్ట్లు
రాసుకున్నాను. దిల్రాజ్ బ్యానర్లో ఈ సినిమాలు
చేసే అవకాశం వుంది అన్నారు.
0 comments:
Post a Comment