హైదరాబాద్:
నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ
నేత బాలకృష్ణ పొలిటికల్ డైలాగ్ ఒకటి ఇప్పుడు రాజకీయ
వర్గాల్లో చర్చనీయాంశమైనట్లుగా కనిపిస్తోంది. బాలకృష్ణ నటిస్తున్న అధినాయకుడు చిత్రం జూన్ 1వ తారీఖున
విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ
చిత్రం రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందనే విషయం మొదటి నుండి
ప్రచారం జరుగుతున్నదే. అయితే ఆ సినిమాలో
ఓ డైలాగ్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైందంటున్నారు.
మంచి
నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి
కానీ రోడ్ల మీద కాదు.
ఉన్నట్టుండి ఈ విగ్రహ రాజకీయాలు
ఎందుకు మొదలు పెట్టావో, చెబుతావా
లేక చెప్పించమంటావా అనే డైలాగ్ ట్రయరల్స్లో కనిపిస్తోంది. ఇది
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
విగ్రహాలను జగన్ రాష్ట్రంలోని అన్ని
చోట్ల పెట్టిస్తున్న విషయం తెలిసిందే.
ఈ విగ్రహాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రభుత్వాన్ని, జగన్ను ప్రశ్నిస్తోంది.
ప్రతి విగ్రహానికి అనుమతులు తీసుకోవాలని, అనుమతి తీసుకోని విగ్రహాలను కూల్చాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ
చిత్రంలో అందుకు సంబంధించిన డైలాగ్ ఉండటం రాజకీయ వర్గాల్లో
కాక రేపుతోంది.
విగ్రహాల
రాజకీయాలు అంటూ బాలకృష్ణ తన
అధినాయకుడు చిత్రంలో చేసిన ఈ డైలాగ్కు వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి
గానీ లేక ఆ పార్టీ
నేతలు గానీ భుజాలు తడుముకుంటారా
చూడాలా అనే ఆసక్తికర చర్చ
జరుగుతోందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ
రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని కూడా టార్గెట్ చేసుకొని
పరోక్షంగా విమర్శలు చేశారనే ప్రచారం జరుగుతోంది. బాలయ్య తన తాజా చిత్రంలో
ఇటు జగన్ను, అటు
చిరంజీవిని టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ చిత్రంపై ఒక్కసారిగా
ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
0 comments:
Post a Comment