హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టే
జైలుకు వెళుతున్నాడని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ
నేత బాలకృష్ణ సోమవారం అన్నారు. జగన్ స్వయంకృపరాధం వల్లనే
ఇలా జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు లాంటి
నాయకుడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే
అన్నారు.
తాను
సినిమాలలో బిజీగా ఉన్నందు వల్లే ఉప ఎన్నికల
ప్రచారానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం కుటుంబ సభ్యులం
అందరం కష్టపడతామని, అందరం కలిసే ఉన్నామన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా కలిసి వచ్చిన వారందరినీ
ఆహ్వానిస్తామన్నారు. తన అధినాయకుడు చిత్రంలో
సెటైర్లు వాస్తవమే అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులను
అనుసరించి తన చిత్రంలో సెటైర్లు
ఉన్నాయన్నారు. బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ
నందమూరి తారక రామారావుకు నివాళులు
అర్పించారు.
తెలుగు
వారి కోసం ఎన్టీఆర్ ఎంతో
చేశారన్నారు. ఈ రోజు ఎంతో
పర్వదినం అన్నారు. తాను అధినాయకుడులో ఏ
పార్టీని ఉద్దేశించి సెటైర్లు వేయలేదని, కేవలం ప్రస్తుత రాజకీయ
పరిస్థితులను ఉద్దేశించే ఉన్నాయన్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబుతో
కలిసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకు పండ్లు
పంచారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు
జగన్
ఆస్తులను పేదలకు పంచాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
డిమాండ్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు.
పేదవారి డబ్బు దోచుకున్న వారు
చాలామంది అరెస్టయ్యారన్నారు. అవినీతిపై టిడిపి పోరు ఆగదన్నారు. చంద్రబాబుతో
కలిసి బాలకృష్ణ మాట్లాడారు. కాగా అంతకుముందు నందమూరి
హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 89వ
జయంతి దృష్ట్యా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు
అర్పించారు.
తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణతో మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఉప ఎన్నికల
ప్రచారంలో పాల్గొనేందుకు తాను వెళతానని హీరో
జూనియర్ ఎన్టీఆర్ సోమవారం విలేకరులతో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, కల్యాణ్ రామ్ సోమవారం ఎన్టీఆర్
ఘాట్ వద్ద స్వర్గీయ నందమూరి
తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈ రోజు(మే28)
ఎన్టీఆర్ 89వ జయంతి. నివాళులు
అర్పించేందుకు వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు.
చరిత్ర
ఉన్నంత వరకు గుర్తుండిపోయే వ్యక్తి
ఎన్టీఆర్ అని జూనియర్ అన్నారు.
ఉప ఎన్నికల కారణంగానే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం వాయిదా పడిందని ఆయన చెప్పారు. తన
తండ్రితో మాట్లాడిన తర్వాత ఉప ఎన్నికలకు వెళ్లే
అంశంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం
ఉప ఎన్నికలలో టిడిపిని గెలిపించాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ
టిడిపి అన్నారు. ఆయన ఆశయాలను మనం
ముందుకు తీసుకు వెళ్లాలన్నారు.
ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని
నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు
ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యతను కుటుంబ సభ్యులం అందరం తీసుకుంటామని చెప్పారు.
ఎన్టీఆర్ బతికుంటే బాగుండేదన్నారు. కాంగ్రెసు పార్టీలో చాలా మంది అవినీతిపరులు
ఉన్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై వ్యాఖ్యానించేందికు ఇది సరైన సమయం
కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
0 comments:
Post a Comment