హైదరాబాద్:
అవినీతి ఆరోపణలపై ఆ రాజకీయ పార్టీ
అధ్యక్షుడు అరెస్టు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ
చరిత్రలో ఇదే మొదటి సారి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఆ రకంగా రికార్డు సృష్టించారు.
ఇంతకు ముందు అగ్ర నాయకులు
అరెస్టయిన ఉదంతాలున్నాయి. వాటిలో కొన్ని ముందు జాగ్రత్త చర్యల్లో
భాగంగా జరిగిన అరెస్టులే. రామ్లాల్ గవర్నర్గా ఉన్నప్పుడు తన
ప్రభుత్వాన్ని కూలదోసిన నాదెండ్ల భాస్కర రావు కూలగొట్టినప్పుడు 1984 ఆగస్టులో చేపట్టిన
ఆందోళనలో ఎన్టీ రామారావు అరెస్టయ్యారు.
ధర్నాలు
చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,
దివంగత నేత వైయస్ రాజశేఖర
రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు
అరెస్టయ్యారు. అయితే, తీవ్రమైన క్రమినల్ ఆరోపణలపై వారు జైలుకు వెళ్లలేదు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు కృష్ణ
యాదవ్, రామసుబ్బా రెడ్డ్ి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత వారు
బెయిల్పై విడుదలయ్యారు.
రామసుబ్బారెడ్డిపై
నమోదైన జంట హత్యల కేసును
కోర్టు కొట్టేసింది. కృష్ణ యాదవ్ స్టాంపుల
కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. జైలుకు వెళ్లిన దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన
హై ప్రొఫైల్ రాజకీయ నాయకుల జాబితాలో వైయస్ జగన్ చేరిపోయారు.
టెలికం మాజీ మంత్రి ఎ
రాజా, డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సురేష్ కల్మాడీల జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నారు.
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పార్లమెంటు సభ్యుడిగా జగన్ రికార్డు సృష్టించారు.
మీడియా
సంస్థలు, పవర్ కంపెనీ, ఇతర
వ్యాపారాలు కలిగి ఉన్న వైయస్
జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఆదివారంనాడు అరెస్టు
చేసింది. వైయస్ జగన్ అక్రమాస్తుల
కేసుపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వైయస్
జగన్ వివిధ రూపాల్లో ప్రయోజనం
పొందారనేది జగన్పై వచ్చిన
ప్రధాన ఆరోపణ.
0 comments:
Post a Comment