ఏలూరు/తిరుపతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలపై
కాంగ్రెసు పార్టీ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, పిసిసి మాజీ అధ్యక్షుడు డి
శ్రీనివాస్, సీనియర్ నేత తులసి రెడ్డి
తదితరులు విజయమ్మ వ్యాఖ్యలను తప్పు పట్టారు. విజయమ్మ
కేవలం తన తనయుడు మాత్రమే
బాగుండాలని, మిగిలిన వారు ఏమైనా ఫరవాలేదని
భావిస్తోందని లగడపాటి పశ్చిమ గోదావరి జిల్లాలో విమర్శించారు.
అవినీతికి
పాల్పడిన వారు ఎవరైనా కాంగ్రెసు
పార్టీకి సమానమేనని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి
మృతిపై ఆమె ఇప్పుడు అనుమానాలు
వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో సానుభూతి
కోసం, జగన్ అరెస్టుపై ప్రజల
మద్దతు కోసమే ఆమె హెలికాప్టర్
ప్రమాదాన్ని ప్రస్తావిస్తోందని ఆరోపించారు. సునీల్ రెడ్డి, శ్రీలక్ష్మి జైలుకు వెళ్లినప్పుడు ఆమెకు గుర్తుకు రాలేదా
అన్నారు. జగన్ జైలుకెళ్లాకే అంతా
గుర్తుకు వచ్చిందా అన్నారు.
జగన్
కేసులో చట్టం తన పని
తాను చేసుకు పోతోందని తులసి రెడ్డి అన్నారు.
ప్రభుత్వం గాని, కాంగ్రెసు పార్టీ
గానీ జోక్యం చేసుకోదన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ
విచారణను విజయమ్మ తప్పు పట్టడం విడ్డూరంగా
ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఆస్తులపై పిటిషన్ వేసిన విజయమ్మ తన
తనయుడిపై మాత్రం విచారణను వ్యతిరేకించడం సరికాదన్నారు. ఆమె పుత్రోత్సాహంతో వాస్తవాలను
విస్మరిస్తున్నారని విమర్శించారు. ఆమెది ద్వంద వైఖరి
అన్నారు.
2004 ఎన్నికలలో
కాంగ్రెసు మేనిఫెస్టో కోసం చాలా కష్టపడ్డామని
డి శ్రీనివాస్ అన్నారు. ఆ సంక్షేమ పథకాలు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డివి
అని విజయమ్మ చెప్పడం విడ్డూరమన్నారు. అవి కాంగ్రెసు పథకాలే
అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
చేపట్టిన పథకాలు కూడా ఆయనవి కావని,
కాంగ్రెసువే అన్నారు.
జగన్
అరెస్టుకు, కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది వైయస్ వల్ల మాత్రమే
కాదని, లక్షలాది మంది కార్యకర్తల కృషితో
అన్నారు. తప్పు చేసిన వారు
ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సిబిఐని బ్లాక్
మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై విజయమ్మకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు
తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
0 comments:
Post a Comment