హైదరాబాద్:
తన సోదరుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్
ఎన్టీఆర్ రాజకీయాలను ఎదుర్కోవడానికి నందమూరి హీరో బాలకృష్ణ క్రియాశీలక
రాజకీయాలను వేదికగా చేసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన పార్టీ నాయకులు తలలు ఎగురిసేనప్పుడు బాలకృష్ణ
రాజకీయాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు.
తాజాగా,
పార్టీ అదేశిస్తే ఉప ఎన్నికల్లో ప్రచారం
చేస్తానని ఆయన అన్నారు. హరికృష్ణ,
జూనియర్ ఎన్టీఆర్ తన బావ, తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
కష్టాలు తెచ్చిన ప్రతిసారీ బాలకృష్ణ రంగప్రవేశం చేస్తూ ఆదుకుంటున్నారు. తన కూతురు బ్రాహ్మణిని
చంద్రబాబు కుమారుడు నారా లోకేష్కు
ఇచ్చి వివాహం చేసిన తర్వాత పూర్తిగా
చంద్రబాబు వైపు నిలబడడానికి ఆయన
సిద్ధపడినట్లు చెబుతున్నారు.
సినిమా
రంగానికి సంబంధించి కూడా ఆయన జూనియర్
ఎన్టీఆర్కు కళ్లెం వేయడానికే
నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దమ్ము సినిమా విడుదల
రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా బంద్ను నిర్వహించడం
ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడిని
బలపరిచే తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా తప్పు పట్టడం లేదు.
కానీ చంద్రబాబు వైపు గట్టిగా నిలబడి
ఆ రాజకీయాలను ఎదుర్కోవడానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది.
అసలు
రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఏం చేయదలుచుకున్నారో ఎవరికీ
అంతు పట్టడం లేదు. కానీ, తన
వర్గం నాయకులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైపు
పంపించడానికి జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం మాత్రం జరుగుతోంది. పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీ ఉదంతాన్ని అందుకు
నిదర్శనంగా చూపుతున్నారు.
బాలకృష్ణ
క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి వచ్చే ఎన్నికల్లో
పోటీ చేయడానికి సిద్ధపడినట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆయన శానససభకు పోటీ
చేస్తారా, లోకసభకు పోటీ చేస్తారా అనేది
నిర్ణయం కాలేదు. ఆ విషయాన్ని చంద్రబాబు
నిర్ణయిస్తారని అంటున్నారు. తాను పోటీ చేయడం
ద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు ఇస్తూ,
చంద్రబాబును నిలబెట్టాలనేది ఆయన ప్రయత్నంగా చెబుతున్నారు.
0 comments:
Post a Comment