తెలుగు
అల్లరి నరేష్,రవితేజ ఆల్రెడీ
యమలోకం బ్యాక్ డ్రాప్ లతో సినిమాలు చేస్తున్న
సంగతి తెలిసిందే. రవితేజ దరువు చిత్రం అయితే
షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజుకు రెడీ అయ్యింది. సత్తిబాబు
దర్శకత్వంలో రూపొందే అల్లరి నరేష్ చిత్రం మాత్రం
కొద్ది రోజుల క్రితమే షూటింగ్
మొదలైంది. ఇక్కడ ఈ హవా
ప్రారంభం కాకముందే కన్నడంలో ఉపేంద్ర ఈ తరహా చిత్రానికి
నాంది పలికాడు. పూర్తి త్రీడి గా రూపొందిన ఈ
చిత్రం భారీగా ఈ రోజే అంతటా
విడుదల అవుతోంది.
కఠారి
వీర..సుర సుందరాంగి టైటిల్
తో రూపొందిన ఈ చిత్రం కన్నడ
రొమాంటిక్ ఫాంటసీ గా చెప్తున్నారు. ఈ
చిత్రం ఉపేంద్ర నరకం వెళ్లి అక్కడ
చేసే విన్యాసాలతో నడుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో
డబ్ చేయాలని అప్పుడే నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉపేంద్ర సరసన ఈ చిత్రంలో
రమ్య(దివ్య స్పందన)చేస్తోంది.
సురేష్ కృష్ణ ఈ చిత్రాన్ని
డైరక్ట్ చేసారు. తొలి పూర్తి కన్నడ
త్రిడి చిత్రంగా ఇది ప్రచారం చేస్తున్నారు.
ఉపేంద్ర ఈ చిత్రాన్ని తన
గత హిట్ చిత్రం రక్త
కన్నీరు కు సీక్వెల్ గా
చెప్తున్నాడు. వెటరన్ ఆర్టిస్టు అంబరీష్..యముడుగా ఈ చిత్రంలో ఓ
కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
ఇక ఈ చిత్రం కథ
విషయానికి వస్తే...ఉపేంద్ర ఓ కామన్ మ్యాన్.
అతనికి ఎప్పుడూ కొత్త కొత్తగా ఆలోచించటం...రకరకాల రిస్క్ లు చేయటం అంటే
ఇష్టం. అతను జీవితాశయం అండర్
వలర్డ్ డాన్ అవ్వాలని..దాంతో
అతను అండర్ వరల్డ్ లో
జాయిన్ అవుతాడు. కొద్ది రోజుల్లోనే పేరున్న గ్యాంగస్టర్ అవుతాడు. అయితే అనుకోని పరిస్దితుల్లో
గ్యాంగ్ వార్ లో అతను
రైవల్ గ్రూప్ చేతిలో మరణిస్తాడు. అక్కడనుంచి అతను నరకానికి వెళ్లి
యముడుని కలుస్తాడు.
దాంతో
అక్కడ చిత్ర గుప్తుడు(దొడ్డన్న)ని పట్టుకుని,యముడుకి
చిత్ర గుప్తుడుకి మధ్య తగువు పెట్టి
మెల్లిగా ఇంద్రలోకం జారుకుంటాడు. అక్కడ ఇంద్రుడు కుమార్తె
దేవకన్య(రమ్య)ని చూసి
ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి మళ్లీ
నరకానికి వెళ్లి తన తండ్రి మోహన్(రక్త కన్నీరు ఉపేంద్ర)ను కలుస్తాడు. అలా
కథ ఈ రెండు లోకాల్లో
తిరిగి..తిరిగి భూలోకం చేరుతుంది. క్లైమాక్స్ కి అతను మారి..అండర్ వరల్డ్ ని
చెదరకొట్టి ఎలా రమ్యని తన
దాన్ని చేసుకున్నాడనేది మిగతా కథ. ఈ
చిత్రంపై కన్నడ పరిశ్రమలో మంచి
అంచనాలే ఉన్నాయి.
0 comments:
Post a Comment