"లైవ్ గా
నేను ఎప్పుడూ భానుని కలవలేదు...చూడలేదు...అలాంటి స్ధితిలో నాకు, భానుకి సంబంధం ఉందని
పేపర్లలో, టీవిల్లో భాధ్యతా రాహిత్యంగా వేస్తే...రేపు నా అమ్మా నాన్నకు,నా ఫ్యామిలీకి
గానీ ఏమన్నా గానీ అయితే ఎవరు భాధ్యుడు?" ...అంటూ గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్
మీడియాని ప్రశ్నించారు. మీడియాలో...తీన్ మార్, ఆంజనేయులు సినిమాలకు భాను ఫైనాన్స్ చేసాడన్న
నేపధ్యంలో ఆయన ఇలా స్పందించారు.
మరో ప్రక్క నిర్మాత
బండ్ల గణేష్‌పై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుబ్బారావు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బండ్ల గణేష్ తనకు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని తెలిపారు. డబ్బు ఇవ్వమని అడిగితే పిసిసి
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మద్దిలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను
పేర్లు చెప్పి బెదిరించాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు బండ్ల
గణేష్ పేరు అంతటా నలుగుతోంది. తీన్‌మార్ చిత్రం విదేశీ హక్కుల కోసం రూ. 2.25 కోట్లు
డబ్బు తీసుకుని కూడా గణేష్ సకాలంలో ప్రింట్ అందించలేదని ఆయన చెప్పారు. ఇదేమని అడిగితే
తన వెనక బొత్స ఉన్నారని బెదిరించారని ఆయన అన్నారు.
రౌడీల అండ కూడా
తనకు ఉందని చెప్పాడని ఆయన అన్నారు. ప్రీమియర్ షో జరగకపోవడం వల్ల రూ. 48 లక్షలు నష్టపోయినట్లు
ఆయన చెప్పారు. గణేష్ కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ ఎలా సినిమాలు తీస్తున్నారనే విషయంపై
సిఐడి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమా విషయంలో కూడా
ముందస్తు అధిక ధరలకు టికెట్లు అమ్ముతూ ప్రేక్షకులను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని
ఆయన అన్నారు. నిర్మాత గణేష్ ప్రింట్లు సకాలంలో అందించకపోవడంపై తాము ఆర్థిక నష్టపోయామని
చెబుతూ సుబ్బారావు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని డిసిపి జాన్ విక్టర్
మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఈ విషయంలో రాజీ కోసం కుదిరిన ఒప్పందం ప్రకారం గణేష్
రూ. 91.5 లక్షలు ఇవ్వాల్సినా 4 నెలలుగా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.
పవన్ కళ్యాణ్,
శృతి హాసన్ జంటగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’.
హరీష్‌శంకర్ ఎస్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న
ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే 4న సెన్సార్ జరుపుకోనుందని
వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సెన్సార్ డేట్ మే 7కి ఫోస్ట్ ఫోన్ అయ్యింది. దాంతో
చిత్రం కూడా వాయిదా పడే అవకాశముందంటూ రూమర్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో తమ సినిమా
మే 11 న ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని నిర్మాత గణేష్ బాబు కన్ఫర్మ్ చేసి చెప్పారు.







0 comments:
Post a Comment