ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో
‘బాద్ షా’అనే చిత్రం రూపొందనుందనే
సంగతి తెలిసిందే. పూర్తి స్ధాయి కామిడీగా రూపొందే ఈ చిత్రంపై ఇప్పుడో
రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారమవుతోంది. ఈ
‘బాద్ షా’చిత్రం హిందీలో సూపర్ హిట్టైన సింగ్
ఈజ్ కింగ్ కి కాపీ
అంటున్నారు. ఇక్కడ తెలుగు వాతావరణానికి
కొద్దిగా మార్చి ఈ చిత్రాన్ని తీస్తున్నారు.
గతంలో శ్రీను వైట్ల సూపర్ హిట్
దూకుడు చిత్రం కూడా ఇలాగే జర్మనీ
చిత్రం గుడ్ బై లెనిన్
నుంచి తీసుకోవటంతో ఇప్పుడీ వార్తకు బాగా ప్రచారం లభిస్తోంది.
ఇక అక్షయ్ కుమార్,కత్రినా కైఫ్ కాంబినేషన్ లో
'సింగ్ ఈజ్ కింగ్'విపుల్
షా ఈ చిత్రాన్ని నిర్మించారు.
రిలీజైన ప్రతీచోటా ఈ చిత్రం హిట్
టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపించింది. నమస్తే
లండన్ ని పోలిఉండే ఈ
చిత్రంలోని అంశాలు అందులోని పెయిర్ (అక్షయ్ కుమార్,కత్రినా కైఫ్ )ని రిపీట్
చేయటం విశేషం. ఈ కథ ఓ
పంజాబి పల్లెలో ప్రారంభమవుతుంది. అక్కడ అక్షయ్ కుమార్
హ్యాపీ సింగ్ గా అమాయికుడుగా
కనిపిస్తాడు. ఊరి పెద్ద కొడుకైన
హ్యాపీ సింగ్ అల్లరి చిల్లరిగా
లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ
గడిపేస్తూంటాడు. భాధ్యతలంటూ తెలియని అతను అనుకోకుండా ఏ
భాధ్యతను భుజాన వేసుకుంటాడు. అది
ఆ ఊళ్ళో రేపో మాపో
అన్నట్లుండే ఒక ముసలి దంపతుల
బిడ్డ లక్కీ సింగ్ ని
ఆస్ట్రేలియా నుండి వెనక్కి తీసుకొస్తానని
మాట ఇస్తాడు.
అయితే
అతను వెనక్కి తెస్తానన్న లక్కీ సింగ్ (సోనూ
సూద్)మామూలు వాడు కాదు. ఆస్ట్రేలియా
లో డాన్ గా ఎదిగి
ఉంటాడు. హ్యాపీ వాడిని వెనక్కి తేవటానికి తన స్నేహితుడు ఓంపురితో
కలిసి బయిలు దేరి పొరపాటున
ఈజిప్టు లో దిగి అక్కడ
కత్రినా కైఫ్ ని ప్రేమలో
పడేస్తాడు. ఓ రెండు పాటలు
ఉషారుగా పాడుకుని ఆస్ట్రేలియా బయలుదేరుతారు. అక్కడ లక్కీసింగ్ లో
మానసిక పరివర్తన తీసకొచ్చి తన ఊరికి తీసకొచ్చి
తన ఊరి వారి ప్రశంలు
పొందుతాడు. గతంలో వెల్ కమ్,నొ ఎంట్రీ వంటి
కామెడీలను అందించిన అనీష్ ఈ సినిమాను
రూపొదించాడు. విమర్శకులు దీన్ని తింగర సినిమా అని
ఏకినా భాక్సాఫీస్ రికార్డులను బ్రద్దలు కొట్టి అక్షయ్ కుమార్ కి ఓ హిట్
ని ఇచ్చింది.
ఇక బాద్షా విషయానికి వస్తే...ఈ చిత్రానికి సంబంధించిన
రెగ్యులర్ షూటింగ్ మే 15న ప్రారంభం
కానుంది. తొలి షెడ్యూల్ ను
ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో
ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్
సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే
బృందావనం లాంటి హిట్ సినిమా
రావటంతో మంచి క్రేజ్ వస్తుందని
భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్
ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న
ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.
ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి
చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న
శ్రీను వైట్ల ఈ సారి
అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో
‘బాద్ షా’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు
కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత
దర్శకుడు తమన్ తో పాటు
చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్
షా’ చిత్రానికి పని చేస్తున్నారు.







0 comments:
Post a Comment