కర్నూలు:
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్తో
వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్
కాంగ్రెసు నాయకుడు కొండారెడ్డి రవీంద్ర రెడ్డి సంబంధాలు వెలుగు చూశాయి. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో
కాంట్రాక్టర్లను బెదిరించి 18 కోట్ల రూపాయలు దండుకున్నట్లు
భాను కిరణ్ తన నేరాంగీకార
పత్రంలో అంగీకరించాడు. ఈ స్థితిలో భాను
కిరణ్తో కర్నూలు జిల్లాకు
చెందిన నలుగురు ప్రజాప్రతినిధుల సంబంధాలు వెలుగు చూసినట్లు ఓ ప్రముఖ తెలుగు
దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.
రెండు
రోజుల క్రితం సిఐడి అధికారులు కొండారెడ్డి
రవీంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు ఆ పత్రిక రాసింది.
నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు శాసనసభ్యులకు, నందికొట్కూరు ఫాక్షన్ నేతకు భానుతో సంబంధాలున్నట్లు
ఆ పత్రిక రాసింది. హైదరాబాదు, కర్నూలు కేంద్రాలుగా రాజకీయ నాయకులు భాను, మంగలి కృష్ణ
సాయం తీసుకుని వందల ఎకరాలు సొంతం
చేసుకున్నట్లు ఆ పత్రికా కథనం
సారాంశం.
రవీంద్రా
రెడ్డి కోసమే శంషాబాద్ సమీపంలోని
రెండు వదంల ఎకరాల భూమి
సెటిల్మెంట్తో పాటు హైదరాబాద్
పరిసరాల్లో వివాదాల పరిష్కారంలో భాను సహకారం తీసుకున్నట్లు
తెలుస్తోంది. ఆగస్టు రెండో తేదీన జగన్
ఓదార్పు యాత్ర కోసం కర్నూలు
జిల్లాకు వచ్చినప్పుడు కొండా రెడ్డి రవీంద్రారెడ్డి
భారీ ఏర్పాట్లు చేశారు. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఆళ్లగడ్డకు చెందిన ఓ ప్రముఖ ఫాక్షన్
నేత పార్టీ మార్చడంలోనూ మంగలి కృష్ణ, భాను
కిరణ్ ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ నాయకుడికి సంబంధించిన భూవివాదంలో భాను కిరణ్, మంగలి
కృష్ణ జోక్యం చేసుకుని వారిపై దాడికి పాల్పడినట్లు, ఆ పంచాయతీ దివంగత
నేత వైయస్ రాజశేఖర రెడ్డి
సమక్షంలో జరగినట్లు, ఈ స్థితిలో తప్పనిసరి
స్థితిలో ఆ నేత పార్టీ
మారినట్లు ఆ పత్రిక రాసింది.
నంద్యాల నియోజకవర్గం పరిధిలోని మరో ఇద్దరు నేతలు
కూడా ఇదే రీతిలో వైయస్
జగన్ వెంట వెళ్లినట్లు రాసింది.
0 comments:
Post a Comment