మొక్రోసాఫ్ట్
వ్యవస్థాపకుడు, ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్ ఉపయోగించిన
కారు ఒకటి ప్రస్తుతం వేలానికి
వచ్చింది. మొక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ఓ
1979 మోడల్ 'పోర్షే 911 టర్బో' కారును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ కారు ఆస్ట్రియాకు
చేరింది. ఆస్ట్రియాలోని వియన్నాకు చెందిన వేలం సంస్థ డోరోథియం
జూన్ 2వ తేదీన ఈ
కారును వేలం వేయనుంది.
బిల్
గేట్స్‌కు హై స్పీడ్
కార్లంటే క్రేజ్ ఎక్కువ, అందులోనూ పోర్షే కార్ బ్రాండ్ మరీ
ఇష్టమట. బిల్ గేట్స్‌ను
ఈ కారు చిక్కుల్లో పడేసింది.
ఈ కారు వల్ల బిల్
గేట్స్ పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లాల్సి
వచ్చిందట. పోర్షే 911 టర్బో కారును మితిమీరిన
వేగంతో నడిపినందుకు ఒకే రోజులో మూడు
ఛలాన్లను జారీ చేయటమే
కాకుండా, బిల్ గేట్స్‌ను
అరెస్టు చేయటం కూడా జరిగింది.
బిల్
గేట్స్‌ను ఇంత ఇబ్బందులకు
గురి చేసిన ఈ కారును
మాత్రం, అతను తన వద్దే
ఉంచుకున్నాడు. 1990వ దశకంలో బిల్
గేట్స్ ఈ కారును విక్రయించేశాడు.
అప్పటి నుండి ఇది ఆస్ట్రియాలో
వివిధ పేర్లపై రిజిస్టర్ అవుతూ వచ్చింది. ఈ
కారుకు మొదటి యజమాని మాత్రం
బిల్ గేట్సే. ఈ కారు యూరోపియన్
యూనియన్‌లో తయారైనప్పటికీ, అమెరికా
దేశానికి తగినట్లుగానే ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ పోర్షే 911 కారును ఇటీవలే అప్‌గ్రేడ్ చేయటం
జరిగింది. ఈ కారుకు తొలిసారిగా
ఉపయోగించిన ఒరిజినల్ కలర్‌తో పాటుగా
రీబిల్డ్ చేయబడిన 3.3 లీటర్ ఎయిర్ కూల్డ్
ఫ్లాట్ సిక్స్ ఇంజన్ వరకూ వివిధ
మార్పులు చేసి అప్పటి లుక్
అండ్ ఫీల్‌ను అలానే
ఉండేలా తయారు చేయబడింది. ఈ
పోర్షే 911 టర్బో కారు బిడ్డింగ్
15,000 యూరోల నుండి ప్రారంభం అవుతుంది.
వేలంలో ఈ కారు సుమారు
39,000 యూరోల నుండి 50,000 యూరోలు (55,500 డాలర్ల నుండి 71,000 డాలర్లకు సమానం) పలుకుతుందని అంచనా.
0 comments:
Post a Comment