అనంతపురం:
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాల
పక్కన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
విగ్రహాలు పెట్టి రాజ్యాంగ నిర్మాతను అవమానించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
బుధవారం అన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో
ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల
సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడటంతో పాటు
వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.
అనంతపురం
అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ను గెలిపించాలని ఆయన
కార్యకర్తలను కోరారు. కాంగ్రెసు ప్రభుత్వ అసమర్థతను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంతో పాటు వివిధ వర్గాల
వారికి టిడిపి అధికారంలో ఉండగా చేసిన మంచి
పనుల్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
అభివృద్ధి,
సంక్షేమ రంగాలను విస్మరించిన కాంగ్రెసు పేదల పొట్ట కొడుతోందని
విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వారి ఇళ్ల
నిర్మాణం అంటూ అధికార పార్టీయే
యాభై శాతం దోచుకుంటోందని విమర్శించారు.
కాంగ్రెసు పాలనలో ప్రజలు విసిగి పోయారన్నారు. వారికి ఉప ఎన్నికలలో బుద్ధి
చెప్పాలన్నారు. అనంతపురం టిడిపికి కంచుకోట అని చెప్పారు.
కాగా
అంతకుముందు హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర
రావు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ శ్రీవారి పర్యటన
వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై
దాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి
కుటుంబానికి హిందూమతంపై తీవ్ర వ్యతిరేకత ఉందని
ఆరోపించారు. డిక్లరేషన్ ఫాం పైన సంతకం
పెట్టకుండా జగన్ లోనికి వెళ్లడం
సరికాదన్నారు.
0 comments:
Post a Comment