రామ్
చరణ్ తాజాగా అమితాబ్ సూపర్ హిట్ జంజీర్
ని రీమేక్ ని చేస్తున్న సంగతి
తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో
సైతం రిలిజ్ చేయనున్నారు. ఈ విషయమై రామ్
చరణ్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో....పనిలో పనిగా మేము
జంజీర్ ని హిందీతో పాటు
తెలుగు వెర్షన్ ని కూడా షూట్
చేస్తున్నాం అన్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్
గా చేస్తోంది. ఈ చిత్రానికి మార్కెట్లో
అప్పుడే క్రేజ్ మొదలైంది.
గతంలో
'ముంబై సే ఆయా మేరా
దోస్త్', 'ఏక్ అజ్నబీ',
'షూటవుట్ ఎట్ లోఖండ్వాలా'
చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్
కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్
అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్.
రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా
నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్రాజ్, అర్జున్ రాంపాల్,
మహీ గిల్ ప్రధాన పాత్రధారులు.
ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు అమిత్
మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత ' జంజీర్' దర్శకుడు
ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన
తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని
చెప్తున్నాడు.
అలాగే
ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో
కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ రీమేక్‌లో
అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి
అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ విషయమై దర్శకుడు
అపూర్వ లఖియా ని మీడియా
సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్
మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను.
ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్
బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం''
అన్నారు.
మరో ప్రక్క రామ్ చరణ్ ఈ
చిత్రం కోసం హిందీ నేర్చుకుంటున్నాడు.
ఆ విషయం చెప్తూ...నా
హిందీ నేర్చుకునే విషయానికి వస్తే...ఓ ట్యూటర్ తో
నేను హిందీ నేర్చుకునే పనిలో
ఉన్నాను అన్నారు. అలాగే ఈ చిత్రం
ఆయిల్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు స్క్రిప్టుని తిరగరాసినట్లు దర్శకుడు తెలియచేసాడు. సంజయ్ దత్ ఈ
చిత్రంలో విలన్ గా చేయనున్నారు.
అగ్నిపధ్ లో సంజయ్ దత్
అదరకొట్టడంతో నెగిటివ్ పాత్రకు ఆయనైతేనే సరిపోతాడని భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్
మాత్రం తన తాజా చిత్రం
రచ్చ రిలీజై మంచి టాక్ తెచ్చుకుని
దూసుకుపోవటంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు.
0 comments:
Post a Comment