మహారాష్ట్రలో
జరిగిన ఓ యదార్థ సంఘటన
ఆధారంగా ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో
విభిన్న కథా చిత్రం రూపొందనుంది.
బి.ఎస్. ఎంటర్ టైన్మెంట్
లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కె.ఎస్.ప్రసాద్ ఈచిత్రాన్ని
నిర్మిస్తున్నారు. ‘ఆంటీ అంకుల్ నందగోపాల్’ దర్శకుడు
డి.వి.కె. నాగేశ్వరరావు
తన ద్వితీయ చిత్రంగా ఈ చిత్రానికి దర్శకత్వం
వహిస్తున్నారు.
మే మూడో వారంలో ప్రారంభం
కానున్న ఈచిత్రం గురించి నిర్మాత కె.ఎస్. ప్రసాద్
మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనకు ఇన్
స్పైర్ అయి ఈ చిత్రాన్ని
రూపొందిస్తున్నాము. ఈ చిత్రంలో ముమైత్
ఖాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. కథ మొత్తం ముమైత్
ఖాన్ చుట్టూ తిరుగుతుంది. మే మూడో వారంలో
ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాము.
ప్రస్తుతం
ప్రవీణ్ ఇమిడి సంగీత దర్శకత్వంలో
మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ
యువ జంట హీరో హీరోయిన్లుగా
నటించబోతున్నారు. ఆ హీరో హీరోయిన్ల
ఎంపిక జరుగుతోంది. సబ్జెక్టు డిమాండ్ మేరకు బడ్జెట్ కి
వెనకాడకుండా ఈచిత్రాన్ని భారీగా నిర్మించడానికి ప్లాన్ చేశాం. బ్యాంకాక్, హైదరాబాద్, ముంబైలలో ఈ చిత్రం షూటింగ్
జరుగుతుంది’ అన్నారు.
ముమైత్
ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ
చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, ఎం.ఎస్.
నారాయణ, కృష్ణ భగవాన్, భరత్,
పృథ్వీ, మాస్టర్ భువన్ ముఖ్య పాత్రలు
పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:
ప్రసాద్, ఎడిటింగ్ నందమూరి హరి, ఫైట్స్: నందు,
నిర్మాత: కె.ఎస్. ప్రసాద్,
కథ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డి.వి.కె. నాగేశ్వరావు.
0 comments:
Post a Comment