హైదరాబాద్:
నందమూరి హీరో బాలకృష్ణ నటించిన
అధినాయకుడు చిత్రం విడుదలను నిలిపి వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం ఎన్నికల సంఘాన్ని కోరింది. అధినాయకుడు చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని వారు ఎన్నికల సంఘానికి
ఫిర్యాదు చేశారు. సినిమాలో బాలకృష్ణ వేసిన సెటైర్లపై
వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అదే సమయంలో ఉప ఎన్నికల ప్రచారానికి
తాను రాకపోయినప్పటికీ తన సినిమాను పంపిస్తున్నానని
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కూడా
వారు ప్రస్తావించారు.
ఈ చిత్రం విడుదల విడుదలను వెంటనే నిలిపివేయాలని, ఉప ఎన్నికలు అయిపోయాక
విడుదలకు అనుమతించాలని వారు ఈసిని కోరారు.
ఇప్పటికే ఈ చిత్రంపై సమైక్యాంధ్ర
ఐక్య కార్యాచరణ సమితి అభ్యంతరం వ్యక్తం
చేసిన విషయం తెలిసిందే. అధినాయకుడు
చిత్రంలోని డైలాగులు ఓ పార్టీని ఉద్దేశించే
విధంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. ఓ
పార్టీకి చెందిన డైలాగ్స్ ఉన్నాయన్నారు. రెండు రోజుల క్రితం
బాలకృష్ణ మాట్లాడుతూ... అధినాయకుడు చిత్రాన్ని ఉప ఎన్నికల ప్రచారం
కోసం పంపిస్తున్నామని చెప్పారని, ఆ వ్యాఖ్యలపై తాము
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
ఉప ఎన్నికల కోసం అధినాయకుడును పంపిస్తున్నానన్న
బాలకృష్ణ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్గా
తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
సినిమా జూన్ 1వ తేదిన
విడుదలకు సిద్ధమైందని, ఓ పార్టీకి అనుకూలంగా
ఉన్నందున ఆ సినిమాను ఉప
ఎన్నికల తర్వాత విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తాజాగా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఈ సినిమా
విడుదల ఆపాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం గమనార్హం.
మంచి
నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి
కానీ రోడ్ల మీద కాదు,
ఉన్నట్టుండి ఈ విగ్రహ రాజకీయాలు
ఎందుకు మొదలు పెట్టావో, చెబుతావా
లేక చెప్పించమంటావా అనే డైలాగ్ ట్రయరల్స్లో కనిపిస్తోంది. ఇది
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
విగ్రహాలను జగన్ రాష్ట్రంలోని అన్ని
చోట్ల పెట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో
వారు ఈసిని ఆశ్రయించారు.
0 comments:
Post a Comment