హైదరాబాద్:
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు నిద్రలేకుండా చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఏ అంశమైనా
ఆందోళన కలిగిస్తుందా అంటే అవుననే చెప్పవచ్చు.
కాంగ్రెసు పార్టీని వీడి సొంత కుంపటి
పెట్టుకున్న జగన్ను కట్టడి
చేసేందుకు స్వయంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత కుంపటి ఏర్పర్చుకున్నప్పటి
నుండి జగన్ టిడిపి, కాంగ్రెసులకు
వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.
సానుభూతి,
యువనేత, నిత్యం ప్రజలలో ఉండటం తదితర కారణాలతో
నిత్యం జగన్ విపక్షాలకు వణుకు
పుట్టిస్తున్నారు. అలాంటి జగన్కు ఓ
సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే 9 సంఖ్య. ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
నిత్యం జగన్ హవాకు అడ్డుకట్ట
వేసేందుకు భిన్నమైన విమర్శలతో ముందుకు వస్తున్నారు.
అలా విపక్షాలనే ముప్పుతిప్పలు పెడుతున్న జగన్ను మాత్రం
9 సంఖ్య కలవరపెడుతోందంటున్నారు. అందుకు పలు కారణాలు చూపిస్తున్నారు.
వైయస్ జగన్ తండ్రి, దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మృతి చెందింది 2009 సెప్టెంబర్లో. అంటే తొమ్మిదో
నెలలో. మే 9వ తేదిన
ప్రభుత్వం సాక్షి మీడియాకు ప్రకటనలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే
18(1+8=9)న సాక్షి ఆస్తుల అటాచ్మెంట్ జివో
జారీ చేసింది.
సిబిఐ
మే 27(2+7=9)వ తేదిన జగన్ను అరెస్టు చేసింది.
ఆ తర్వాత చంచల్గూడ జైలుకు
వెళ్లిన జగన్కు జైలు
అధికారులు ఇచ్చిన నెంబర్ కూడా తొమ్మిదితో లింక్
అయి ఉంది. జగన్కు
జైలులో ఇచ్చిన నెంబర్ 6093(6+0+9+3=18). అంతేకాదు అసెంబ్లీకి ఉప ఎన్నికలలు జరుగుతున్న
మొత్తం నియోజకవర్గాలు కూడా 18(ఎంపి స్థానం మినహా).
సాక్షి బిల్డింగులో ఎనిమిదో ఫ్లోర్ తర్వాత ఫ్లోర్ను పదో అంతస్తుగా
పిలుస్తారట.
0 comments:
Post a Comment