మంచు
విష్ణు కి ప్రస్తుతం ప్రభాస్
డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా
మంచు విష్ణు మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ..."'దేనికైనా రెడీ'లో నేను నా
తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్ని
ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా.
ఆ డైలాగ్స్కి ప్రభాస్ స్వయంగా
డబ్బింగ్ చెబుతున్నాడు '' అని చెప్పారు.
మంచు
విష్ణు హీరోగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్బాబు
నిర్మిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ
చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు.
'దేనికైనా రెడీ' మూడు పాటలు
మినహా సినిమా పూర్తయింది. జూలై చివరలో పాటల్నీ,
ఆగస్టులో సినిమానీ విడుదల చేస్తారు. యూరప్లో రెండు
పాటల్నీ, హైదరాబాద్లో ఓ పాటనీ
తీద్దామనుకుంటున్నారు. ఒకవేళ యూరప్కి
వెళ్లకపోతే, వాటిని కేరళలో తీస్తారు.
చిత్రం
కథ గురించి మంచు విష్ణు చెబుతూ...ఇది ఫ్యామిలీ నేపథ్యంలో
నడిచే వినోదాత్మక చిత్రం. కథంతా కర్నూలులో జరుగుతుంది.
ఈ సినిమా లైన్ బీవీఎస్ రవి
చెబితే, అతనితో కలిసి కోన వెంకట్,
గోపి మోహన్ స్క్రిప్టు డెవలప్
చేశారు. మాటలు మరుధూరి రాజా
రాశారు. 'ఢీ'కి తగ్గట్లుగా
ఉండాలనే ఉద్దేశంతో దానికి ట్యాగ్లైన్గా ఉపయోగించిన
'దేనికైనా రెడీ'నే టైటిల్గా పెట్టాం అన్నారు.
ఈ సినిమాకి ప్రధాన బలం హ్యూమర్. ఈ
సినిమాని 'ఢీ'కి సీక్వెల్
అనొచ్చు. 'ఢీ' కంటే పది
రెట్లు ఎక్కువ కామికల్గా ఉంటుంది. 'ఢీ'కి బ్రహ్మానందం కేరక్టర్
ఎంత ఎస్సెట్ అయ్యిందో తెలిసిందే. ఇందులోనూ ఆయన నాతో పాటే
ఉంటారు. 'ఢీ' కంటే పది
రెట్లు ఎక్కువ కామెడీ ఆ కేరక్టర్లో
ఉంది. అందులో 'రావుగారూ నన్ను ఇన్వాల్వ్
చెయ్యకండి' అనే మేనరిజమ్తో
నవ్వించిన ఆయన ఇందులోనూ ఓ
మేనరిజమ్తో తెగ నవ్విస్తారు.
హన్సికతో మొదటిసారి పనిచేశా అన్నారు.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్ప్లే: కోన వెంకట్,
గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి,
ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్గా తెరకెక్కుతున్న ఈ
చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న
వారిలో వర్మ, సెల్వ, రఘు
కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్బాబు, నరసింహ, వాసు,
సుద్దాల అశోక్తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ:
శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్బాబు.
0 comments:
Post a Comment