దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
సోదరుడు, మాజీ మంత్రి వైయస్
వివేకానంద రెడ్డి మంగళవారం అక్రమాస్తుల కేసులో చంచల్గూడ జైలులో
ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చారు. జైలుకు హుషారుగా వచ్చిన వైయస్ వివేకా ఆ
తర్వాత ముఖం చిన్నబుచ్చుకొని వెళ్లిపోయారట.
జగన్ ఆయనను పలకరించకపోవడమే కారణమనే
వాదనలు వినిపిస్తున్నాయి.
మంగళవారం
ములాఖత్ సమయంలో వైయస్ వివేకా జైలుకు
హుషారుగా వచ్చారు. లోపలకు వెళ్లిన కొద్ది సేపటికే ఆయన చిన్నబుచ్చుకున్న ముఖంతో
బయటకు వచ్చారట. బయట ఎవరినీ పలకరించకుండానే
వెళ్లిపోయారు. బాబాయ్ వైయస్ వివేకాను చూసి
జగన్ కనీసం చిరునవ్వు కూడా
నవ్వలేదట. అంతేకాదు బాబాయ్ని చూడగానే ముఖం
పక్కకు తిప్పుకున్నారని తెలుస్తోందని అంటున్నారు.
దీంతో
చిన్నబోయిన వైయస్ వివేకా కాసేపు
అక్కడే వేచి ఉన్నారట. అయినప్పటికీ
జగన్ నుండి ఎలాంటి స్పందన
లేదంటున్నారు. దీంతో చేసేది లేక
ఆయన వెనుదిరిగారని అంటున్నారు. కలిసేందుకు తాను వచ్చినప్పటికీ జగన్
తన వైపు చూడకపోవడం, తనతో
మాట్లాడక పోవడం వల్లనే వైయస్
వివేకా హుషారుగా వచ్చినప్పటికీ ఆ తర్వాత వేదనతో
వెళ్లారని అంటున్నారు.
ఇటీవలి
వరకు వైయస్ వివేకా కాంగ్రెసు
పార్టీలో ఉన్న విషయం తెలిసిందే.
తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డి
కాంగ్రెసు కోసం పాటుపడ్డాడాని తాను
ఆయన దారిలోనే నడుస్తానని చెప్పి అదే పార్టీలో కొనసాగారు.
అయితే ఇటీవల కాంగ్రెసు నేతలు
వైయస్ పైన విమర్సలు చేయడం
తదితర పరిణామాల కారణంగా ఆయన కాంగ్రెసును వీడి
జగన్ పంచన చేరారు.
0 comments:
Post a Comment