హైదరాబాద్:
తెలంగాణలో పోటీ చేసిన పార్టీలన్నింటిదీ
తెలంగాణవాదమేనంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు
హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం స్పందించారు. పరకాలలో పోటీ చేసిన పార్టీలన్నీ
తెలంగాణవాదంతోనే బరిలో నిలిచాయని హరీష్
రావు ఇప్పటికైనా ఒప్పుకోవడం హర్షణీయమన్నారు.
ఇప్పటిదాకా
తెలంగాణవాదానికి తెరాసే ఒకటే అసలైన పార్టీ
అని మిగిలిన పార్టీలు తెలంగాణ ద్రోహులు అని, అవన్నీ సమైక్యవాద
పార్టీలు అని వాదిస్తూ ఓట్లు
అడుగుతూ వచ్చిన తెరాస నాయకులు ఇఫ్పటికైనా
వాస్తవాలు ఒప్పుకోవడం శుభపరిణామమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాను తెరాసకు వ్యతిరేకంగా 67 శాతం ఓట్లు వచ్చాయని
అన్నానే తప్ప తెలంగాణవాదానికి వ్యతిరేకంగా
వచ్చాయనలేదన్నారు.
తెరాస
వేరు తెలంగాణవాదం వేరు అని తాను
మొదటి నుండి చెబుతున్నానని చెప్పారు.
వాస్తవాలు మాట్లాడిన హరీష్ రావును తాను
అభినందిస్తున్నానని చెప్పారు. కాగా రాష్ట్రపతి ఎన్నికను
తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత
నేతలు వాడుకోవాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి
చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జెఏసిగా తాము ఒక కార్యాచరణ
తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రపతి
ఎన్నిక సందర్భంలో తెలంగాణ ఆకాంక్ష వ్యక్తీకరణ అవకాశాన్ని అన్ని పార్టీలు ఉపయోగించుకోవాలని
కోరారు. ఇందుకు సంబంధించి జెఏసిగా తాము అన్ని పార్టీల
ముందు ఒక ప్రతిపాదన పెడతామని
చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో అభిప్రాయం
మార్చుకోవాల్సింది లగడపాటి రాజగోపాల్ కానీ తాము కాదన్నారు.
ఉప ఎన్నికలలో జగన్ పార్టీ గెలిస్తే
రాష్ట్ర విభజన జరుగుతుందని ఆయన
చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
0 comments:
Post a Comment