ఏలూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాలని తాను కోరుకోలేదని తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
బుధవారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి
జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. జగన్ జైలుకు వెళ్లాలని
తాను కోరుకోలేదని, ఆయన అక్రమంగా సంపాదించిన
ఆస్తులను రాష్ట్రంలోని పేదల ప్రజలకు పంచాలని
మాత్రమే ఆశించానని అన్నారు.
బినామీ
పేర్లతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యారాయణ, వైయస్
జగన్ వందల కోట్లు దోచుకున్నారని
ఆరోపించారు. ఇసుకను దోచుకునేందుకు కాంగ్రెసు పెద్దలు సిండికేట్ అయ్యారన్నారు. జగన్ నేరస్తులు, అవినీతిపరులతో
సంబంధాలు పెట్టుకున్నారని మండిపడ్డారు. వైయస్ విజయమ్మ పెంపకం
సరిగా లేదన్నారు. జగన్ సూటుకేసులతో డబ్బులు
తీసుకు వచ్చి విల్లాలు కడుతుంటే
ఎందుకు ఆమె ప్రశ్నించలేదన్నారు.
అంత డబ్బు ఎక్కడిదని ఎందుకు
అడగలేదన్నారు. ఇప్పుడు అరెస్టు చేస్తే మాత్రం అన్యాయమంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. నేరం బయటపడినప్పుడు అరెస్టు
చేయవద్దా అన్నారు. ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం
కాదని, ఉప్పు కిలో ఇవ్వాలని
డిమాండ్ చేశారు. వైయస్ విజయమ్మ కన్నీళ్లకు
సానుభూతి చూపొద్దన్నారు. అవినీతికి పాల్పడ్డప్పుడు ఆమె అడ్డుకోలేదన్నారు.
మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో ప్రధాన
నిందితుడు భాను కిరణ్, మంగళి
కృష్ణలతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఎందుకు నిలదీయలేదన్నారు. జగన్ ఆస్తులను ప్రభుత్వం
స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమానికి ఖర్చు
పెట్టాలన్నారు. కాంగ్రెసు అధిష్టానంకు తెలియకుండా రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి
జరగదన్నారు.
వాన్పిక్ ఒప్పందం లోపభూయిష్టమని
రేవంత్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. మంత్రి మండలి వాన్పిక్కు నాలుగు ఎకరాల
భూమి కేటాయించాలని నిర్ణయిస్తే, 28వేల ఎకరాలు కేటాయించారని,
అందులో 18,800 ఏకరాలు అసైన్డ్ భూములే అన్నారు. వాటిని సొంతదారులకు ఇవ్వాలని వైయస్ విజయమ్మ ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయగలరా అని
ప్రశ్నించారు.
0 comments:
Post a Comment