"రికార్డులతో
మనకు పనిలేదు. మూడు వేషాలేసే దమ్మున్నోడెవడన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తా. ఎంతోమందికి సమాధానం
చెబుతుంది ఈ సినిమా''అన్న నందమూరి బాలకృష్ణ మాటలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి.
ఈ హీరోని ఉద్దేశించి ఈ మాటలు బాలకృష్ణ అన్నాడని అందరూ భుజాలు తడుముకుంటున్నారు. సినిమా
రిలీజవ్వగానే అందరూ రికార్డుల గురించి మాట్లాడుతున్న ఈ రోజుల్లో బాలకృష్ణ కామెంట్ అందరినీ
ఆలోచనలో పడేస్తోంది.
అయితే ఇది బాలకృష్ణ
కాన్పిడెంట్ గా చెప్తున్న మాటలా..లేక సినిమాపై హైప్ క్రియేట్ చేయటానికి అంటున్నావా
అనేది సందిగ్దంగా ఉంది అని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ బాలకృష్ణ ఎప్పుడూ తన సినిమాని
ప్రమోట్ చేసుకోవటానికి ఎలాంటి హైప్ క్రియేట్ చేసే స్టేట్ మెంట్స్ ఇవ్వడని,గతంలోనూ ఇవ్వలేదు
కాబట్టి అధినాయకుడు మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది అంటున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో
శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్‌చౌదరి 'అధినాయుడు' చిత్రాన్ని నిర్మించారు.
అధినాయకుడు'లో
త్రిపాత్రాభినయం చేశా. మూడూ వైవిధ్యమైన పాత్రలే. ఈ మూడు పాత్రల్లో ఎవరు అధినాయకుడు
అనే ప్రశ్న చాలామందిలో ఉంది. నా దృష్టిలో మూడు పాత్రలూ అధినాయకుడే. ట్రెండ్‌తో మనకు
పనిలేదు. తప్పు చేసినవాడి బెండు తియ్యడమే మన స్టయిల్. ఇందులో పెద్దాయన కేరక్టర్ మొదట
అనుకోలేదు. ఆ పాత్రను దర్శకుడు పరుచూరి మురళి అద్భుతంగా తయారుచేశారు. నేనేం చేసినా
ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా.
అన్ని వర్గాల
ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. కల్యాణీమాలిక్ అద్భుతమైన మ్యూజిక్
ఇచ్చారు. ఆయనకు ఇదో మంచి అవకాశం. కేరక్టర్ని ఎలివేట్ చేసే పాత్రలు నా సినిమాల్లోనే
ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది ఇటీవల 'ప్రచారానికి వస్తున్నారా?' అనడిగారు. 'వస్తున్నా.
సినిమా వస్తోంది' అని చెప్పా. ప్రజల్లో తిరుగుబాటునీ, ఆలోచననీ తీసుకువచ్చే చిత్రమే
'అధినాయకుడు' అని చెప్తున్నారు. వచ్చే నెల మొదటి తేదినచిత్రం విడుదల అవుతోంది. ఇప్పటికే
అన్ని చోట్ల ఈ చిత్రం టిక్కెట్లు బుక్ అయిపోయి బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ ని తెలియచేస్తున్నాయి.
0 comments:
Post a Comment