నిమ్మకాయలో
విటమిన్ సి పుష్కలంగా వుంటుంది.
దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం. నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక
పానీయంగా భావిస్తారు. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు. నిమ్మ కాయలు మన
దేశంలో విరివిగా లభ్యమవుతూంటాయి. నిమ్మరసాన్ని మన దేశ వంటలలో
రుచికిగాను విరివిగా వాడుతూంటారు. అంతేకాదు, నిమ్మకాయను ఔషధంగా కూడా కొన్ని అనారోగ్యాలకు
ఉపయోగిస్తారు.
నిమ్మకాయను
వంటకాలలో రుచికి వాడతారు. నిమ్మరసం కొద్దిగా పిండితే చాలు పదార్ధాల రుచి
మారిపోతుంది. ఇక చికెన్, మొదలైన
ఆహారాలలో నిమ్మరసం వాడని వారుండరు. నిమ్మరసాన్ని
నీటిలో కలిపి ఆరోగ్యకర పానీయంగా
తాగుతారు. ప్రత్యేకించి ఉదయంవేళ ఈ నీటిని తాగితే
ఆరోగ్యం మెరుగవుతుంది. పాలు లేకుండా టీ
తాగేవారు కొద్దిగా నిమ్మరసాన్ని, తేనెను చేర్చి తాగుతారు.
ప్రతిరోజూ
నిమ్మరసం తాగుతూ వుంటే... వచ్చే ప్రయోజనాలు పరిశీలించండి.
జీర్ణ
వ్యవస్ధకు మంచిది - జీర్ణక్రియ సమస్యలు పరిష్కరించబడుతాయి. అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట,
కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటివి రాకుండా వుంటాయి. పురాతన కాలంలో మీ తల్లులు అమ్మమ్మలు
జ్వరం వచ్చినా లేక పొట్ట గడబిడ
అయినా ఒక్క గ్లాసు నిమ్మరసంతో
వాటిని తగ్గించేవారని మీరు వినే వుంటారు.
చర్మ
కాంతి - నిమ్మరసం చర్మ సంబంధిత సమస్యలను
నివారిస్తుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని సంరక్షించి
చర్మ కాంతిని కలిగిస్తుంది. నిమ్మరసం రోజూ తాగితే, ఆరోగ్యం
మెరుగుపరచి వయసు కనపడనివ్వకుండా కూడా
చేస్తుంది.
బరువు
తగ్గేందుకు - చాలామంది బరువు తగ్గేందుకు ఉదయం
వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు.
గొంతు
సమస్యలు - గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ
మంచి ఔషధం. దీనిలోని యాంటీ
బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి.
అధిక
రక్తపోటు నియంత్రణ - గుండె జబ్బుల సమస్యలున్నవారికి
నిమ్మ రసం నీరు, దీనిలోని
పొటాషియం కారణంగా ఎంతో బాగా పని
చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు
బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి
పోగొట్టి మైండ్ కు శరీరానికి
విశ్రాంతినిస్తుంది.
0 comments:
Post a Comment