‘దమ్ము’
క్లయిమాక్స్‌లో నాజర్‌ని
ఎన్టీఆర్ తెగ నరికితే బాగుండేదని చాలామంది అన్నారు. కానీ చంపడం పరిష్కారం కాదని అప్పటివరకు
నీతి వాక్యాలు చెప్పిన హీరో చివరికి శత్రువుని చంపితే కథ పక్కదారి పడుతుంది. క్లయిమాక్స్
పవర్‌ఫుల్‌గా ఉండాలని కథని మార్చలేం కదా అని తేల్చి చెప్పారు దర్శకుడు బోయపాటి శ్రీను.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దమ్ము' ఇటీవలే 25 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్భంగా
మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ఇంటర్వెల్
వద్ద ఈ సినిమాలో గొడవలకు భయపడి ఎన్టీఆర్ విలేజ్ నుంచి పారిపోతాడు. కమర్షియల్ హీరో పారిపోవడం
అనేది సహజంగా చూపించరు. కానీ కథ అలా ఉంది కాబట్టి అలానే చేశాను అన్నారు. 'మొదట్లో కొంత
డివైడ్ టాక్ వచ్చింది, కానీ తిరిగి పుంజుకొని మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. తీసిన
నిర్మాత, కొన్ని బయ్యర్లు అంతా సంతోషంగా ఉన్నారు. ఇదంతా అభిమానుల సహకారం, వారి ప్రోత్సాహంతోనే
సాధ్యమైంది. ఎన్టీఆర్, చిత్ర నిర్మాత అందించిన సహకారం మరువలేనిది. సినిమా బాగా రావడానికి
వారెంతో కష్టపడ్డారు అని చెప్పారు.
ఈ చిత్రంలో పవర్‌ఫుల్
డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. కొన్ని డైలాగ్స్ ఎన్టీఆర్ కోరిక మేరకు రాసినవనే అభిప్రాయం
కొంతమందికి ఉంది. కానీ, శత్రువుకు సమాధానం చెప్పే సమయంలో హీరో డైలాగులు పేలవంగా ఉంటే
బాగుండదు కాబట్టి, సన్నివేశం డిమాండ్ మేరకు అలాంటి డైలాగులు మేమే రాశాం కానీ ఎన్టీఆర్
ప్రభావం మా మీద ఏమాత్రం లేదు. అలాగే చంపడం పరిష్కారం కాదంటూ, శాంతి మార్గంలోకి వెళ్లాలనుకున్న
హీరో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కసారిగా తిరగబడతాడు. ఆ సమయంలో పవర్‌ఫుల్ ఫైట్స్ లేకపోతే
సీన్ పండదు. అందుకని ఈ సినిమాకి సంబంధించిన ఫైట్స్, డైలాగులు, సెంటిమెంట్... ఏదైనా
కథ డిమాండ్ మేరకే తప్ప నేల విడిచి సాము చేయలేదు అన్నారు.
కత్తి పట్టుకోవడం
ఎన్టీఆర్‌కి కొత్తకాదు. కానీ అలాంటి ఓ కథలో పలు భావోద్వేగాలు పలికించడం మాత్రం ఇదే
మొదటిసారి. ఆయన పాత్రను మూడు కోణాల్లో తీర్దిదిద్దాను. వాటిలో ఒదిగిపోయిన విధానం ఎన్టీఆర్
నటనలోని దమ్మెంతో చూపించింది. ఎన్టీఆర్ మూడు భిన్నమైన కోణాలున్న పాత్ర పోషించాడు.
మాస్, క్లాస్, యాక్షన్..అంశాలే కాకుండా, ఓ నాయకుడిగా పెద్ద తరహాగా కనిపించి మెప్పించాడు.
కథ డిమాండ్ మేరకే రాజకీయ అంశాలు జోడించాం. సినిమా అనేది అభిమానులకు మాత్రమే నచ్చితే
సరిపోదు. సాధారణ ప్రేక్షకుడిని కూడా మెప్పించాలి. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని పనిచేశాను
అన్నారు.
0 comments:
Post a Comment