హైదరాబాద్:
తన తండ్రి, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణతో మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఉప ఎన్నికల
ప్రచారంలో పాల్గొనేందుకు తాను వెళతానని హీరో
జూనియర్ ఎన్టీఆర్ సోమవారం విలేకరులతో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, కల్యాణ్ రామ్ సోమవారం ఎన్టీఆర్
ఘాట్ వద్ద స్వర్గీయ నందమూరి
తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈ రోజు(మే28)
ఎన్టీఆర్ 89వ జయంతి. నివాళులు
అర్పించేందుకు వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు.
చరిత్ర
ఉన్నంత వరకు గుర్తుండిపోయే వ్యక్తి
ఎన్టీఆర్ అని జూనియర్ అన్నారు.
ఉప ఎన్నికల కారణంగానే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం వాయిదా పడిందని ఆయన చెప్పారు. తన
తండ్రితో మాట్లాడిన తర్వాత ఉప ఎన్నికలకు వెళ్లే
అంశంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం
ఉప ఎన్నికలలో టిడిపిని గెలిపించాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ
టిడిపి అన్నారు. ఆయన ఆశయాలను మనం
ముందుకు తీసుకు వెళ్లాలన్నారు.
ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని
నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు
ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యతను కుటుంబ సభ్యులం అందరం తీసుకుంటామని చెప్పారు.
ఎన్టీఆర్ బతికుంటే బాగుండేదన్నారు.
కాంగ్రెసు
పార్టీలో చాలా మంది అవినీతిపరులు
ఉన్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై వ్యాఖ్యానించేందికు ఇది సరైన సమయం
కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
0 comments:
Post a Comment