రామ్
గోపాల్ వర్మ తన స్కిప్టు
వాడుకుని తన డబ్బు ఎగ్గొట్టి
తనను ఛీట్ చేసాడంటూ ముంబైకి
చెందిన దినేష్ అనే రచయిత పోలీస్
కేసు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ
తాజా చిత్రం డిపార్టమెంట్ కు తను స్కిప్టు
వర్కు చేసానని తన బాకీలు చెల్లించలేదని
ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. మే
7న ఈ కేసు ముంబైలోని
పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యింది.
గతంలోనూ రణ్ చిత్రం విడుదల
సమయంలో వర్మపై మరో రచయిత ఈ
తరహా కేసు నమోదు చేసిన
సంగతి తెలిసిందే.
ఆ రచయిత మాట్లాడుతూ... తనను
జూన్-జూలై 2010లో వర్మ ఆఫీసుకు
చెందిన నీరజ్ శర్మ అనే
వ్యక్తి కాంటాక్ట్ చేసాడని,డిపార్టమెంట్ అనే చిత్రానికి స్క్ర్రీన్
ప్లే రాయాలని చెప్పారని చెప్పారు. దాంతో నేను ఆయన్ని
కలిసాను. వాళ్ళు నా స్క్రిప్టులు కొన్ని
చూసారు. నా పనితీరు నచ్చి
తమతో డిపార్టమెంట్ స్కిప్టుకి పనిచేయమని అడిగారని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో
మీటింగ్స్ జరిగాయి...నేను ఫస్ట్ డ్రాఫ్ట్
ని జూలై 19,2010 న సబ్ మిట్
చేసాను అని చెప్పారు.
ఆ తర్వాత తాను డిపార్టమెంట్ స్క్రీన్
ప్లే మీద వర్క్ చేసాను.వర్మ కూడా నాతో
కొన్ని సీన్స్ డిస్కస్ చేసారు. నా ఫీజు మొదటే
ఫిక్స్ చేసారు. నేను కంటాక్ట్ గురించి
అడిగాను. వాళ్ళు డిలే చేస్తూ వచ్చారు.
దాంతో నేను వర్క్ చేయటం
ఆపు చేసాను. అఫ్పుడు వాళ్లు నాకు మెయిల్ లో
కాంటాక్ట్ గురించి సాప్ట్ కాపీ పంపారు. కానీ
నేను వారు సైన్ చేసి
వచ్చిన హార్డ్ కాపీ ఉంటేనే వర్క్
చేయాలని వెయిట్ చేసాను. తర్వాత వారు నా కాల్స్
కూడా లిప్ట్ చేయటం మానేసారు అన్నారు.
ఇక పిబ్రవరి 2011 లో నీరజ్ నాతో
డిపార్టమెంట్ చిత్రం ఫండ్స్ రైజ్ కాకపోవటంతో ఆపు
చేసామని అన్నారు. అలాగే రాము కూడా
నాట్ ఎ లవ్ స్టోరీ
బిజీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అప్పుడు ఇక నేను నా
తదుపరి వర్క్ కోసం డిల్లీ
వెళ్లిపోయాను. ఆ తర్వాత కొంత
కాలానికి డిపార్టమెంట్ చిత్రానికి సంభదించి కొన్ని ప్రోమోలు చూసి ఆశ్చర్యపోయాను. దాంతో
నేను ముంబై వచ్చి ఈ
పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని మీడియాకు చెప్పారు. ఇక డిపార్టమెంట్ చిత్రం
ఈ నెల 18న విడుదల
అవుతోంది. సంజయ్ దత్,అమితాబ్
నటించిన ఈ చిత్రంలో తెలుగునుంచి
దగ్గుపాటి రానా,మధుశాలిని,లక్ష్మిమంచు
కూడా చేసారు.
0 comments:
Post a Comment