చిత్తూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి
వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ ఒకటి ద్వారా ఆయన
బుధవారం ఉదయం ఆలయంలోకి ప్రవేశించారు.
ఆ తర్వాత కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
శ్రీవారిని
దర్శించుకునేందుకు వైయస్ జగన్ మంగళవారం
రాత్రి తిరుమలకు వచ్చారు. ఆయన శ్రీకృష్ణ అతిథి
గృహంలో బస చేశారు. జగన్తో పాటు వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేత, తిరుమల తిరుపతి
దేవస్థానం మాజీ చైర్మన్ భూమన
కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జగన్తో పాటు
వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
కాగా
వైయస్ జగన్మోహన్ రెడ్డి దైవ దర్శనం నారా
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల ఎఫెక్ట్ అనే వాదన వినిపిస్తోంది.
మూడు రోజుల క్రితం చంద్రబాబు
తిరుపతిలో మాట్లాడుతూ.. జగన్ ఇప్పటి వరకు
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి
వారిని దర్శించుకోలేదని విమర్శించారు. ఆయన వ్యాఖ్యల కారణంగానే
జగన్ బుధవారం శ్రీవారిని దర్శించుకొని ఉంటారని అంటున్నారు.
కాగా
జగన్ ఒక్కసారి శ్రీవారిని దర్శించుకోలేదని చంద్రబాబు చెప్పిన తర్వాత.. యువనేతకు చెందిన సాక్షి అంతకుముందు జగన్ తిరుమల శ్రీవారిని
దర్శించుకున్న ఫోటోను ఒకటి ప్రచురించింది. శ్రీవారిని
దర్శించుకోలేదని జగన్ పైన చంద్రబాబు
అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది సరికాదని చెప్పింది.
మరోవైపు
జగన్ మంగళవారం తిరుపతి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఆయన రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పార్టీని హోల్
సేల్గా కాంగ్రెసుకు అమ్ముకున్నారని
విమర్శించారు. చిరంజీవి తిరుపతికి ఏం చేశారని ప్రశ్నించారు.
0 comments:
Post a Comment