ఏలూరు:
తమ పార్టీ నేత బంగారు లక్ష్మణ్
రూ.లక్ష లంచం తీసుకుంటున్నట్లుగా
రహస్యంగా చిత్రీకరించి ఆయనకు శిక్షపడేలా చేసినవారు,
రూ.లక్ష కోట్లు తిన్న
వారిని ఎందుకు పట్టించుకోవడం లేదని భారతీయ జనతా
పార్టీ నేత వెంకయ్య నాయుడు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని, జాతీయ కాంగ్రెసును ఉద్దేశించి
పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత మధ్యంతర ఎన్నికలుసహా ఏదైనా జరగవచ్చునని ఆయనవ్యాఖ్యానించారు.
కేంద్ర,
రాష్ట్రాల్లో ప్రభుత్వాల పీడ విరగడయ్యే రోజు
కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈ పరిస్థితుల్లో సరైన
ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని ధీమా
వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ముగిసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆయన ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు ఛీకొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బిజెపికిఏ
పార్టీతోనూ పొత్తు అవసరంగానీ, ఆ ప్రసక్తిగానీ ఉండవని
తేల్చి చెప్పారు.
పార్టీ
నేతలు, కార్యకర్తలు ఇప్పట్నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకే గూటి పక్షులని,
వాటి నేతల మధ్య విమర్శలు
ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయని ఎద్దేవా
చేశారు. మజ్లిస్లాంటి మతతత్వ పార్టీతో
జతకట్టిన పార్టీలు బిజెపిపై మతతత్వం పార్టీ పేరిట బురదజల్లడం హాస్యాస్పదమన్నారు.
కుల, ధన ప్రభావాలకు భిన్నంగా
బిజెపి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ
తెస్తామంటూ పదకొండేళ్ల కిందట వచ్చిన పార్టీ
ఆ తర్వాత కాంగ్రెస్, టిడిపిలతో చెరోసారి జట్టుకట్టిందని, ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని అది ఏ మేరకు
నిలబెట్టుకుందో చెప్పాలని టిఆర్ఎస్పై మండిపడ్డారు. బిజెపి
చిన్న రాష్ట్రాలకే కట్టుబడి ఉందని, ప్రజలను ఒప్పించి రాష్ట్రాన్ని విభజించడం ఖాయమని చెప్పారు.
ప్రాంతీయ
పార్టీలు దేశ సమస్యను పరిష్కరించలేవన్న
విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నారు.
బిజెపి అధికారంలోకి వస్తే మతమార్పిడులపై నిషేధం
విధిస్తుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లను
ఆమోదించబోదని అన్నారు. మాతృభాషను ప్రోత్సహిస్తామని, దీనికి అందరూ కలిసి రావాలని
విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఉప ఎన్నికలలో కేవలం
రెండు మూడు స్థానాలకే పోటీ
పడుతున్నాయని ఆయన విమర్శించారు.
0 comments:
Post a Comment